News July 6, 2024

HYD: మా అమ్మ కాంగ్రెస్‌లో చేరదు: MLA కుమారుడు

image

తమను, తమ కార్యకర్తలను ఎంత వేధించినా సరే తాము కాంగ్రెస్‌లో చేరబోమని, BRSలోనే ఉంటామని మహేశ్వరం MLA సబితాఇంద్రారెడ్డి కుమారుడు, ఆ పార్టీ రాష్ట్ర నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. ‘మా అమ్మ కాంగ్రెస్‌లో చేరదు.. గతంలో ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీ మారాం.. ఇక BRSలోనే కొనసాగుతాం.. పార్టీ ఫిరాయింపులు వద్దని రాహుల్ గాంధీ చెబుతుంటే.. రేవంత్ వినడంలేదు’ అని అన్నారు.

Similar News

News November 23, 2025

HYD: సమయం లేదు మిత్రమా.. పనులు చకచకా

image

మరో రెండువారాల్లో (డిసెంబర్ 8,9) ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కానున్నసంగతి తెలిసిందే. దీంతో అధికారులు మీర్‌ఖాన్‌పేట వద్ద పనులు చకచకా చేయిస్తున్నారు. దాదాపు 120 ఎకరాలను చదును చేయిస్తున్నారు. పనులపై ఏరోజుకారోజు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అప్‌డేట్ ఇస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో పనుల్లో ఆలస్యం జరగరాదని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో నిరంతరం పనులు చేయిస్తున్నారు.

News November 23, 2025

HYD: వీకెండ్ డ్రంక్& డ్రైవ్‌లో 468 మంది దొరికారు

image

సైబరాబాద్‌లో వీకెండ్ డ్రంక్& డ్రైవ్‌లో 468 మంది పట్టుబడ్డారు. వాహనాల వారీగా 335 టూవీలర్లు, 25 ఆటోలు, 107 కార్లు, 1 హెవీ వెహికల్ సీజ్ చేశారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే ప్రమాదం జరిగితే BNS సెక్షన్ 105 కింద 10 ఏళ్ల జైలు శిక్ష వర్తిస్తుందని పోలీసులు హెచ్చరించారు. గత వారం 681 కేసులు డిస్పోజ్ కాగా.. 613 మందికి ఫైన్, 50 మందికి ఫైన్+ సర్వీస్, 18 మందికి ఫైన్+ జైలు శిక్ష విధించారు.

News November 23, 2025

HYD: జంట జలాశయాల ప్రత్యేకత ఇదే!

image

ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలు నగరవాసుల దాహార్తిని తీరుస్తున్నాయి. మూసీ నది 1908లో భాగ్యనగరాన్ని వరదలతో ముంచెత్తగా.. అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆ వరదలకు అడ్డుకట్ట వేసేందుకు 1920-1926లో మూసీ, ఈసీ నదులపై మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రణాళికతో వంతెనలు నిర్మించారు. అప్పటి నుంచి నగరానికి తాగునీటి సరఫరా చేయడం ప్రారంభించారు.