News January 13, 2025

HYD: మిసెస్ ఇండియా తెలంగాణగా మిథాలీ అగర్వాల్

image

హైదరాబాద్ వేదికగా నిర్వహించిన మిసెస్ ఇండియా పోటీల్లో తెలంగాణకు చెందిన మిథాలీ అగర్వాల్.. మిసెస్ ఇండియా తెలంగాణగా నిలిచారు. అండర్ 40లో 3వ స్థానంలో నిలిచి ఆమె రన్నరప్లో నిలిచారు. మిసెస్ మమత త్రివేది నిర్వహించిన ఈ ఈవెంట్‌లో వివిధ వయసు కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. మిథాలీ అగర్వాల్ గతంలో ఐఐటీ హైదరాబాద్ PROగా విధులు నిర్వహించారు. ఆమె విజయంపై పలువురు అభినందనలు తెలిపారు.

Similar News

News November 5, 2025

జూబ్లీ సర్వేల వెనుక కేటీఆర్ కుట్ర: చనగాని దయాకర్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కేటీఆర్ వెనుక ఉండి చేయిస్తున్న ఫేక్ సర్వేలతో ప్రజల అభిప్రాయం మారదని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడుతూ.. ఫేక్ సర్వేలు పూర్తి ప్రజా అభిప్రాయం కాదన్నారు. సర్వేల వెనుక కేటీఆర్ కుట్ర ముమ్మాటికి ఉందని అందుకే సర్వేల ఆర్టిస్టులు బయటకు వచ్చారన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ముమ్మాటికి అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు.

News November 5, 2025

ప్రతాపసింగారం: పంచవృక్షాల మహిమాన్వితం.. శైవక్షేత్రం

image

మేడ్చల్ జిల్లా ప్రతాపసింగారంలోని శివాలయం విశిష్టతతో భక్తుల మనసును ఆకట్టుకుంటోంది. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు నిర్మించిన ఈ దేవాలయంలో రావి, మారేడు, వేప, ఉసిరి, జమ్మి పంచవృక్షాలు ఒకేస్థలంలో పెరిగాయి. ఈ 5 వృక్షాలు సాక్షాత్ దైవతత్త్వాన్ని ధారపోస్తూ ఆ ప్రదేశాన్ని పవిత్ర శక్తిక్షేత్రంగా మార్చేశాయి. ఆధ్యాత్మిక తేజస్సు విరజిమ్మే ఈ ప్రాంగణంలో కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే శుభఫలాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

News November 5, 2025

HYD: రేవంత్ రెడ్డికి KTR కౌంటర్

image

జూబ్లీహిల్స్ బైఎలక్షన్ రోడ్ షోలో సీఎం వ్యాఖ్యలకు KTR స్పందించారు. ‘భారత రాజ్యాంగం ఆర్టికల్స్ 25-28 ద్వారా మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా ఇచ్చింది. దీనికి అంబేడ్కర్ కృషి చేశారు. ప్రతి పౌరుడు తన మతాన్ని స్వేచ్ఛగా పాటించడానికి, ప్రచారం చేయడానికి ఈ హక్కు అనుమతిస్తుంది. ​రాజకీయ చర్చలతో లౌకిక రాజ్యమైన భారత్ గొప్పతనాన్ని అపహాస్యం చేయొద్దు’ అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.