News November 14, 2024

HYD: మీకు చికెన్, మటన్ షాప్ ఉందా..? జాగ్రత్త..!

image

HYDలో వేలాదిగా చికెన్, మటన్ షాపులు కొనసాగుతున్నాయి. అనేక చోట్ల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. చికెన్ కట్ చేసే సమయంలో ఈగలు వాలటం, అపరిశుభ్రత కారణంగా పలువురు అస్వస్థత గురయ్యారు.దీనిపై జీహెచ్ఎంసీ వెటర్నరీ, హెల్త్ అధికారులు తనిఖీలు చేసి జరిమానా విధించారు. షాప్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News December 4, 2024

HYDలో పెరిగిన కోడిగుడ్ల ధరలు

image

రాష్ట్ర వ్యాప్తంగా కోడిగుడ్ల ధరలు పెరిగాయి. హోల్ సేల్ మార్కెట్లో ధర రూ.5.90గా NECC నిర్ణయించింది. దీంతో HYDలోని పలు ప్రాంతాల్లో రిటైల్ మార్కెట్లో రూ.6.50 నుంచి రూ.7 వరకు అమ్ముతున్నారు. 4నెలల క్రితంతో పోల్చితే రూ.3 వరకు పెరిగాయి. చలికాలంలో గుడ్ల వినియోగం పెరగడంతో, క్రిస్మస్, న్యూ ఇయర్‌కు కేకులు తయారీలో వాడుతుండటంతో రేట్లు పెరిగినట్లు అమ్మకదారులు తెలిపారు. ధరలు మరింత పెరగుతాయని అంచనా.

News December 4, 2024

HYD: గవర్నర్‌ను కలిసిన మంత్రులు

image

రాజ్ భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 5వ తేదిన ఇందిరా మహిళా శక్తి బజార్ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను గవర్నర్‌కు అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

News December 4, 2024

HYD: దివ్యాంగులకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క

image

రవీంద్రభారతిలో జ్యోతి వెలిగించి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను మంత్రి సీతక్క ప్రారంభించారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలోనే దివ్యాంగుల పెన్షన్లు పెంచుతామని మంత్రి హామీ ఇచ్చారు. యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లనే మోదీ ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు.