News November 14, 2024
HYD: మీకు చికెన్, మటన్ షాప్ ఉందా..? జాగ్రత్త..!
HYDలో వేలాదిగా చికెన్, మటన్ షాపులు కొనసాగుతున్నాయి. అనేక చోట్ల పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటంపై జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. చికెన్ కట్ చేసే సమయంలో ఈగలు వాలటం, అపరిశుభ్రత కారణంగా పలువురు అస్వస్థత గురయ్యారు. దీనిపై జీహెచ్ఎంసీ వెటర్నరీ, హెల్త్ అధికారులు తనిఖీలు చేసి జరిమానా విధించారు. షాప్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News December 1, 2024
HYD: మాలలు ఐక్యతను చటాలి: ఎమ్మెల్యే వివేక్
మాల, మాధిగలను వేరు చెయ్యాలని చూస్తున్నారని, మాలలు ఐక్యంగా పోరాడి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన మాలల సింహగర్జన సభకు ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. మాలల ఐక్యత చాటేలా నేతలంతా ఒకే వేదికపైకి వచ్చి నినదించారు. రాష్ట్ర నలుమూలల నుంచి మాలలు భారీగా తరలివచ్చారు.
News December 1, 2024
మిని శిల్పారామంలో అలరించిన సాంస్కృతిక ప్రదర్శన
ఉప్పల్ మిని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జీవన శిష్య బృందం నిర్వహించిన భరతనాట్య ప్రదర్శన, సుప్రజ బృందం కథక్ నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. సంగీతానికి అనుగుణంగా సాగిన వారి నృత్యం చూపరులను మంత్రి ముగ్ధులను చేసింది.
News December 1, 2024
HYD: శ్రీనివాస పద్మావతి అమ్మవారికి పద్మశాలిల చీర, సారె
తిరుమల, తిరుపతి దేవస్థానం, తిరుచానూర్‌లోని శ్రీనివాస పద్మావతి అమ్మవారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ మహిళా విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళా ప్రతినిధులు పాల్గొని అమ్మవారికి చీర,సారెను అందజేశారు. పద్మావతి అమ్మవారిని పద్మశాలి ఆడపడుచుగా భావించి తల్లిగారి తరపున చీర, సారెను అందజేసినట్లు అఖిల భారత పద్మశాలి సంఘం మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వనం దుష్యంతల తెలిపారు.