News March 28, 2025
HYD: మీరు ఇందులో నీళ్లు తాగుతున్నారా?

RO ప్లాంట్లు HYDలో విపరీతంగా పుట్టుకొచ్చాయి. కిరాణా షాపుల్లోనూ 20L వాటర్ రూ.15-20కి విక్రయిస్తున్నారు. ఈ ప్లాంట్ల నీరు తాగడంతో కిడ్నీల సమస్యలు, జట్టురాలడం, గుండె సమస్యలు వస్తాయని రుజువైంది. సోడియం సల్ఫేట్, పొటాషియం వంటి ఖనిజాలు కలిపితేనే మినరల్ వాటర్. RO వాటర్లో ఇవన్నీ ఉండవు. నాసీరకం క్యాన్లలో నీరుతాగినా ప్రమాదాన్ని కొనుక్కున్నట్లే. సర్టిఫైడ్ ప్లాంట్లలో, నాణ్యమైన డబ్బాల్లో నీటిని తెచ్చుకోవాలి.
Similar News
News January 5, 2026
రవీంద్రభారతిలో కౌశికి గానానికి నగరం ఫిదా!

రవీంద్రభారతిలో ఆదివారం రాత్రి జరిగిన త్రివేణి- సీజన్ 3 సంగీత విభావరి నగరవాసులను ఆకట్టుకుంది. సుర్మండల్ ఆధ్వర్యంలో జరిగిన ఈవేడుకలో విదుషీమణి కౌశికి చక్రవర్తి తన గాత్రంతో పటియాలా వైభవాన్ని కళ్లకు కట్టారు. ‘రాగ్ శ్రీ, దుర్గా, యాద్ పియాకీ ఆయే’తో హోరెత్తించారు. మరోవైపు చిత్రకారుడు సచిన్ జల్తారే గీసిన చిత్రపటాన్ని ‘స్పర్శ్ హాస్పైస్’ క్యాన్సర్ రోగుల సేవకు విరాళంగా ఇచ్చి సంగీతానికి సేవా గుణాన్ని అద్దారు.
News January 5, 2026
HYD: 1,200 బస్సులతో సంక్రాంతికి వస్తున్నాం..!

జనవరి వచ్చిందంటే సంక్రాంతి ముచ్చట్లే ఉంటాయి. సొంతూరుకు ఎప్పుడెళ్లాలి? ఎలా వెళ్లాలి? అనే చర్చలు ఎక్కడ చూసినా ఉంటాయి. సంక్రాంతి సెలవుల్లో సొంతూరిలో గడిపితే ఆ మజానే వేరబ్బా అని పలువురు నగరవాసులు భావిస్తున్నారు. అందుకే ఆర్టీసీ నగర ప్రయాణికుల కోసం ఈ ఏడాది 1,200 ప్రత్యేకంగా బస్సులను వివిధ ప్రాంతాలకు నడుపుతోంది. ఈ నెల 9 నుంచి ప్రత్యేక బస్సులు నడిపేలా ప్రణాళికలు రూపొందించింది.
News January 5, 2026
HYD: ఆధార్ సెంటర్ ఎక్కడో ఈజీగా తెలుసుకోండి

గ్రేటర్ పరిధి రామంతాపూర్లో ఆధార్ సెంటర్ వద్ద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాసిన కథనంపై ఆధార్ సర్వీస్ యంత్రాంగం స్పందించింది. ఆధార్ అప్డేట్ చేసుకునేవారు పెరగటంతో రద్దీ ఏర్పడుతున్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు. గ్రేటర్ HYD వ్యాప్తంగా ఆధార్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని, వాటి వివరాలు తెలుసుకోవడం కోసం bhuvan.nrsc.gov.in/aadhaar/ వెబ్సైట్ సందర్శించాలని సూచించారు.


