News March 28, 2025
HYD: మీరు ఇందులో నీళ్లు తాగుతున్నారా?

RO ప్లాంట్లు HYDలో విపరీతంగా పుట్టుకొచ్చాయి. కిరాణా షాపులోనూ 20L వాటర్ రూ.15-20కి విక్రయిస్తున్నారు. ఈ ప్లాంట్ల నీరు తాగడంతో కిడ్నీల సమస్యలు, జట్టురాలడం, గుండె సమస్యలు వస్తాయని రుజువైంది. సోడియం సల్ఫేట్, పొటాషియం వంటి ఖనిజాలు కలిపితేనే మినరల్ వాటర్. RO వాటర్లో ఇవన్నీ ఉండవు. నాసిరకం క్యాన్లలో నీరుతాగినా ప్రమాదాన్ని కొనుక్కున్నట్లే. సర్టిఫైడ్ ప్లాంట్లలో, నాణ్యమైన డబ్బాలో నీటిని తెచ్చుకోవాలి.
Similar News
News December 6, 2025
హైదరాబాద్లో హారన్ మోతలకు చెక్.!

హైదరాబాద్లో రోజురోజుకు ట్రాఫిక్ పెరిగిపోతోంది. దీనికితోడు హారన్ల మోత మోగుతుంది. దీనికి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు యోచిస్తున్నారు. ముంబై తరహాలో “హాంక్ మోర్ వెయిట్ మోర్” పద్ధతిని తీసుకురానున్నారు. దీంతో రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఎంత ఎక్కువగా హారన్ కొడితే అంత ఎక్కువ సమయం వేచి చూడాల్సి వస్తుంది. దీని వల్ల ముంబైలో 60% సౌండ్ పొల్యూషన్ తగ్గింది. ఇదే తరహాలో ఇక్కడ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
News December 6, 2025
నేడు అంబేడ్కర్ వర్థంతి.. నారా లోకేశ్ ట్వీట్

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను అంటూ మంత్రి నారా లోకేశ్ ‘X’ లో పోస్ట్ చేశారు. ‘దళితుల సాధికారత, పేద, బడుగు వర్గాల శ్రేయస్సు కోసం ఆయన జీవితాంతం కృషిచేశారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం పరితపించారు. నవభారత నిర్మాణానికి బాటలు వేసిన దార్శనికుడు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరం కృషిచేద్దాం’ అంటూ రాసుకొచ్చారు.
News December 6, 2025
విశాఖ: క్రికెట్ ఫ్యాన్స్కు అలర్ట్.. ట్రాఫిక్ ఆంక్షలివే

భారత్-దక్షిణాఫ్రికా వన్డే సందర్భంగా విశాఖ పోలీసులు పార్కింగ్ మార్గదర్శకాలు విడుదల చేశారు. వీఐపీలు NH-16 ద్వారా నేరుగా స్టేడియానికి చేరుకోవాలి. నగరం నుంచి వచ్చే వారు సాంకేతిక కాలేజీ వద్ద, శ్రీకాకుళం వైపు నుంచి వచ్చే వారు కార్ షెడ్, మిధిలాపురి వద్ద పార్క్ చేయాలి. బీచ్ రోడ్ నుంచి వచ్చే వారికి MVV సిటీ, ఆర్టీసీ బస్సులకు లా కాలేజీ వద్ద స్థలం కేటాయించారు.


