News September 11, 2025

HYD: మీరు వినరు.. వారు వదలరు

image

గణేశ్ ఉత్సవాల్లో హైదరాబాద్ షీ టీమ్స్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. 1,612 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొంది. పట్టుబడ్డ వారిలో 1,544 మంది పెద్దలు, 68 మంది ఉన్నారు. ఇందులో 168 పెట్టి కేసులు నమోదు చేయగా.. 70 కేసులకు సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. కొందరికి జరిమానా, ఒకరికి 2 రోజుల సింపుల్ జైలు శిక్ష, 1,444 మందికి వార్నింగ్, కౌన్సెలింగ్ కోసం పిలిచి అవగాహన కల్పించారు.

Similar News

News April 5, 2026

HNK: ఇండోర్ స్టేడియంకు రాజకీయ గ్రహణం!

image

హనుమకొండలోని ఇండోర్ స్టేడియానికి రాజకీయ గ్రహణం పట్టింది. గతేడాది కాలంగా రిపేర్ల పేరిట స్టేడియం మూసేశారు. మరోపక్క పనులు చేసిన కాంట్రాక్టర్‌కు నిధులు విడుదల కాకపోవడంతో, తాళం తీయట్లేదు. అధికార పార్టీ నేత పున: ప్రారంభం విషయంలో తనదే పైచేయి ఉండాలనే ఉద్దేశ్యంతో తాళం తీయనీయట్లేదని ప్లేయర్లు వాపోతున్నారు. షటిల్ కోర్టులో రాజకీయాలు ఎక్కువ కావడమే స్టేడియానికి తాళం కొనసాగతుందని ఆటగాళ్లు ఆరోపిస్తున్నారు.

News April 5, 2026

IPL హిస్టరీలో ఫాస్టెస్ట్ బాల్స్ ఇవే

image

నిన్న RRతో మ్యాచ్‌లో 154.2km/h వేగంతో(ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్ బాల్) బౌలింగ్ చేసి GT యంగ్ బౌలర్ <<19568795>>అశోక్ శర్మ<<>> అదరగొట్టారు. ఐపీఎల్ హిస్టరీలో ఇది పదో వేగవంతమైన బాల్. 157.7km/h వేగంతో షాన్ టైట్ టాప్‌లో ఉన్నారు. ఆ తర్వాత వరుసగా ఫెర్గూసన్(157.3km/h), ఉమ్రాన్ మాలిక్(157km/h), మయాంక్ యాదవ్(156.7km/h, 155.8km/h), ఆన్రిచ్(156.2km/h, 154.8km/h), డేల్ స్టెయిన్(154.4km/h), రబాడ(154.2km/h) ఉన్నారు.

News April 5, 2026

నెల్లూరు: ఇంటర్న్‌షిప్.. నెలకు రూ.15 వేలు

image

నెల్లూరు జిల్లాలో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ ఫేజ్-3కు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎంపికైన వారికి రూ.9వేలు, స్టైపెండ్, రూ.6వేలు గ్రాంట్, ఇంటర్న్‌షిప్ పూర్తయ్యాక సర్టిఫికెట్ అందజేస్తారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివి వయసు 18-25 ఏళ్ల లోపు ఉన్నవాళ్లు అర్హులు. ఏప్రిల్ 15వ తేదీ లోపు pminternship.mygov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.