News November 16, 2024
HYD: మీ పట్టుదలకు సలాం..! లక్ష్యంపై కసి అంటే ఇదే!

అన్ని బాగున్నా.. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునే ప్రస్తుత రోజుల్లో సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద జరిగిన క్రీడా పోటీల్లో ఏకంగా దివ్యాంగులు బాస్కెట్ బాల్ క్రీడలో సత్తా చాటి వారెవ్వా అనిపించారు. క్రీడాకారుల పట్టుదలను చూసిన ప్రజలు సలాం కొట్టారు. ఇది కదా.. అసలైన పోటీ అంటే, అనుకున్న కల కోసం కాళ్లు లేకున్నా కడదాకా పోరాడుతామని రుజువు చేశారని వారిని అభినందించారు.
Similar News
News March 17, 2026
HYD: నేటి నుంచే ’24 స్పీడ్ పోస్ట్’ సేవలు..!

తక్షణ, అత్యవసర డెలివరీల కోసం ఇండియా పోస్ట్ నేటి నుంచి 24, 48 గంటల స్పీడ్ పోస్ట్ సేవలను ప్రారంభించనుంది. మొదటి దశలో హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో అందుబాటులోకి రానున్న ఈ సేవలు ఒకటి నుంచి రెండు రోజుల్లో వస్తువులను చేరవేస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో OTP ఆధారిత సెక్యూర్ డెలివరీ, SMS ట్రాకింగ్, ఆలస్యమైతే డబ్బు తిరిగి ఇచ్చేసే వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు.
News March 17, 2026
HYD: వారికి డబుల్ బెడ్ రూమ్ రద్దు: మంత్రి

CURE పరిధిలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పొందినా ఆ ఇళ్లలో ఉండని లబ్దిదారులకు ఏప్రిల్ 30 వరకు నోటీసులు జారీ చేసి, స్పందించని వారి ఇళ్లు రద్దు చేసి పేదలకు కేటాయిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. HYDలో పేదల జీవనోపాధికి అనుగుణంగా స్థలాలను గుర్తించి, విద్యుత్, నీరు, డ్రైనేజీ వసతులు కల్పించాలని సూచించారు.