News December 19, 2024

HYD: మీ పాస్‌వర్డ్ భద్రంగానే ఉందా?

image

రాచకొండ పోలీసులు పాస్‌వర్డ్ భద్రతపై అవగాహన కల్పిస్తూ ముఖ్య సూచనలు చేశారు. ఇటీవల HYDలో పలు సైబర్ క్రైమ్‌లు పాస్‌వర్డ్‌ల కారణంగా జరిగినట్లు తేల్చారు. తరచూ మార్చడం, సులభమైన పాస్వర్డ్‌లను (123456) ఉపయోగించకపోవడం, ఇతరులతో పాస్‌వర్డ్ పంచుకోకపోవడం, ఫ్రీ వైఫై నెట్‌వర్క్‌లలో లాగిన్ అవ్వకపోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. భద్రతను మరింత మెరుగుపర్చేందుకు టూ స్టెప్ వెరిఫికేషన్ ఉపయోగించాలని సూచించారు.

Similar News

News November 13, 2025

HYD: నేడే ఫీజు చెల్లింపులకు లాస్ట్..!

image

HYD డా.బీ.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2019- 2024 మధ్య చేరిన డిగ్రీ 1st, 3rd ఇయర్ విద్యార్థులు ఇంకా ట్యూషన్ ఫీజు చెల్లించని వారు NOV 13లోపు చెల్లించొచ్చని విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా.వై.వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే 2022- 2024 మధ్య MA, MCom, MSc అడ్మిషన్ పొందిన వారూ 2nd ఇయర్ ట్యూషన్ ఫీజు చెల్లించొచ్చని వివరించారు. పూర్తి వివరాలకు www.braouonline.inను సందర్శించండి.

News November 13, 2025

అధికారికంగా జూబ్లీహిల్స్‌లో 48.49% ఓటింగ్

image

జూబ్లీహల్స్ బైపోల్ వివరాలు అధికారికంగా వెల్లిడించారు. మొత్తం 4,01,365 మంది ఓటర్లలో పురుషులు 2,08,561 మంది ఉండగావారిలో 99,771 మంది, మహిళలు 1,92,779 మంది ఉండగా 94,855 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇతరులు 25 మంది ఉండగా ఐదుగురు ఓటింగ్‌లో పాల్గొన్నారు. మొత్తంగా 1,94,631 మంది ఓటేశారని అధికారికంగా గణాకాంలు ఇవాళ విడుదల అయ్యాయి. 48.49%తో అతి తక్కువ ఓటింగ్ మనవద్దే నమోదు కావడం గమనార్హం.

News November 13, 2025

HYD: చెరువుల అభివృద్ధి అంటే అందాలు అద్దడం కాదు

image

చెరువుల అభివృద్ధి అంటే అందాలు అద్దడం ఒక్కటే కాదని.. దాని అవసరాలు నెరవేరే విధంగా వాటిని తీర్చాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. శిల్పకళా వేదికలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నిర్వహించిన సౌత్ ఇండియా CSR సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. CSR నిధులు పూర్తిస్థాయిలో సద్వినియోగం అయ్యేలా ఆయా సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.