News February 3, 2025
HYD: మీ పిల్లల్లో ఇలాంటి ప్రవర్తన గుర్తిస్తే జాగ్రత్త..!
మత్తుపదార్థాల వినియోగం యువతలో వేగంగా పెరుగుతుండటంతో రాచకొండ సీపీ సుధీర్ బాబు తల్లిదండ్రులకు ముఖ్యమైన హెచ్చరికను జారీ చేశారు. రేవ్పార్టీలు, అనుమానాస్పద మాత్రలు, రహస్య ప్రవర్తన వంటి ప్రారంభ లక్షణాలను గమనించడం వల్ల యువతను మత్తుపదార్థాల మాయాజాలం నుంచి కాపాడవచ్చన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడంతో సమస్యను ముందే గుర్తించి నివారించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News February 4, 2025
‘భారత రత్న’ ఎక్కడ తయారు చేస్తారో తెలుసా?
దేశంలో అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన కొద్ది మందినే ఈ అవార్డు వరిస్తుంది. ఇప్పటివరకు 54 మందికి మాత్రమే ఈ అవార్డునిచ్చారు. అయితే, భారతరత్న పతకాన్ని స్వచ్ఛమైన రాగితో తయారుచేస్తారు. ఇది ఆకు ఆకారంలో, మధ్యలో వెండి రంగులో సూర్యుడి ఆకారపు అంచుతో ఉంటుంది. దీనిని ప్రత్యేకంగా కోల్కతాలోని భారత ప్రభుత్వ మింట్లో రూపొందిస్తారు. ఇక్కడే ఇతర అవార్డులనూ తయారుచేస్తారు.
News February 4, 2025
రెండు మండలాలతో అమీన్ పూర్ మండల పరిషత్
రాష్ట్రంలోని అతి చిన్న మండల పరిషత్గా అమీన్ పూర్ నిలిచింది. రెండు గ్రామపంచాయతీలతో మండల పరిషత్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మండలంలోని వడక్ పల్లిలో 820 ఓట్లతో మూడు ఎంపీటీసీ, జానకంపేట 640 ఓట్లతో రెండు ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా 6 పంచాయతీలను అమీన్ పూర్ మున్సిపాలిటీలో విలీనం చేశారు.
News February 4, 2025
ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: దంతాలపల్లి MPDO
దంతాలపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వివేక్ రామ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి రెండో వారంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున పంచాయతీ సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీఓ అప్సర్ పాషా, సెక్రటరీలు మోడెం మధు, సృజన, నాగరబోయిన శ్రీధర్, సతీష్, అజయ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.