News February 3, 2025
HYD: మీ పిల్లల్లో ఇలాంటి ప్రవర్తన గుర్తిస్తే జాగ్రత్త..!

మత్తుపదార్థాల వినియోగం యువతలో వేగంగా పెరుగుతుండటంతో రాచకొండ సీపీ సుధీర్ బాబు తల్లిదండ్రులకు ముఖ్యమైన హెచ్చరికను జారీ చేశారు. రేవ్‌పార్టీలు, అనుమానాస్పద మాత్రలు, రహస్య ప్రవర్తన వంటి ప్రారంభ లక్షణాలను గమనించడం వల్ల యువతను మత్తుపదార్థాల మాయాజాలం నుంచి కాపాడవచ్చన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడంతో సమస్యను ముందే గుర్తించి నివారించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News February 16, 2025
వనపర్తి: మార్చి 8న జాతీయ లోక్ అదాలత్

వనపర్తి జిల్లాలోని కోర్టులలో మార్చి 8న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్.సునీత పేర్కొన్నారు. రాజీ పడదగిన అన్ని క్రిమినల్, సివిల్, బ్యాంకు, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్‌లో రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కారం చేసుకునేలా కృషి చేయాలన్నారు.
News February 16, 2025
న్యాయమూర్తులను ఏరేస్తున్న ట్రంప్

ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి వివరణ ఇవ్వకుండా 20మంది ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తులను తొలగించారు. దీంతో అధ్యక్షుడికి వ్యతిరేకంగా పలువురు కోర్టులలో వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన ట్రంప్ ‘తన దేశాన్ని కాపాడుకొనే వ్యక్తి ఎన్నటికీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించరు’ అనే ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే కొటేషన్‌ను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.
News February 16, 2025
గద్వాల: రైలు ఢీకొని వ్యక్తి మృతి

గద్వాల పట్టణంలోని మొదటి రైల్వే గేటు వద్ద గుర్తుతెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. రైల్వే ఫ్లై ఓవర్ కింద ప్రమాదం జరగడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందన్నారు. వ్యక్తిని గుర్తించిన వారు గద్వాల రైల్వే పోలీస్ సెల్ 8341252529 నంబర్‌కు కాల్ చేయాలన్నారు.