News December 24, 2024
HYD: మీ ప్రాంతంలో వీధి కుక్కల బెడద ఉందా?

జీహెచ్ఎంసీలో కుక్కల బెడదను తగ్గించేందుకు వెటర్నరీ విభాగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 332వీధి కుక్కలను పట్టుకున్నారు. వాటికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు వేసినట్లు వెటర్నరీ అధికారులు వెల్లడించారు. AWBI నిబంధనల ప్రకారం 189వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేశారు. వీధికుక్కల వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని GHMC పేర్కొంది. మీప్రాంతంలో కుక్కలున్నాయా కామెంట్ చేయండి.
Similar News
News October 15, 2025
హైదరాబాద్: లోన్ ఆఫర్ కాల్స్తో జాగ్రత్త

హైదరాబాద్లో ఫేక్ ఎన్జీఓ లోన్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. బేగంపేటకు చెందిన ఓ వ్యక్తి(30) రూ. 7.9 లక్షలు మోసపోయాడు. హెచ్వైసీ ఫౌండర్ సల్మాన్ ఖాన్ డీపీతో వాట్సాప్ కాల్ చేసిన వ్యక్తి.. రూ.50 లక్షల లోన్ ఇస్తానని నమ్మించి, పలు ఫీజుల పేరుతో రూ. 7.9 లక్షలు వసూలు చేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అపరిచిత లోన్ ఆఫర్లను నమ్మవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.
News October 15, 2025
ఓయూ: ఎంఈ, ఎం.టెక్ పరీక్షా తేదీలు ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈ, ఎం.టెక్ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. అన్ని విభాగాల ఎంఈ, ఎం.టెక్ కోర్సుల రెండో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్లో చూసుకోవచ్చని సూచించారు.
News October 15, 2025
పిల్లల రక్షణ, విద్యకు పక్కా ప్రణాళిక: కలెక్టర్ హరిచందన

పిల్లల రక్షణ, నాణ్యమైన విద్యాబోధన కోసం క్యాలెండర్ ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేసి, పక్కాగా అమలు చేయాలని అనుబంధ శాఖల అధికారులను HYD కలెక్టర్ హరిచందన ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ‘క్లాప్'(సిటీ లెవల్ యాక్షన్ ప్లాన్) అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. పిల్లల రక్షణ, నాణ్యమైన విద్య, స్వచ్ఛమైన ఆహారం అందించుటలో ఈ ప్రణాళికలు కీలకం కావాలని ఆమె సూచించారు.