News December 24, 2024
HYD: మీ ప్రాంతంలో వీధి కుక్కల బెడద ఉందా?
జీహెచ్ఎంసీలో కుక్కల బెడదను తగ్గించేందుకు వెటర్నరీ విభాగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 332వీధి కుక్కలను పట్టుకున్నారు. వాటికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు వేసినట్లు వెటర్నరీ అధికారులు వెల్లడించారు. AWBI నిబంధనల ప్రకారం 189వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేశారు. వీధికుక్కల వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని GHMC పేర్కొంది. మీప్రాంతంలో కుక్కలున్నాయా కామెంట్ చేయండి.
Similar News
News December 26, 2024
HYD: 2030 నాటికి 20 వేల మెగావాట్ల ఇంధన ఉత్పత్తి: భట్టి
2030 నాటికి స్వచ్ఛమైన, స్థిరమైన 20 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ విధానాన్ని ప్రతిపాదించిందన్నారు.
News December 26, 2024
HYD సీపీ చేతనైతే ఆ పని చేయాలి: ఎంపీ రఘునందన్‌రావు
ప్రైవేట్ బౌన్సర్ల వ్యవస్థపై ఎంపీ రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే ఊరంతా కోపగించుకుటారని.. అందరికీ శత్రువులు అవుతారంటూ పెద్దలు చెప్పారని కామెంట్ చేశారు. రాష్ట్రంలో బౌన్సర్లను పెట్టుకుని నెట్టేయించే సంస్కృతిని తెచ్చిందే ఆనాడు TPCC చీఫ్‌గా పని చేసిన రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. HYD సీపీ సీవీ ఆనంద్ చేతనైతే బౌన్సర్ల మీద చర్యలు తీసుకోవాలన్నారు.
News December 26, 2024
నేడు HYD నుంచి కర్ణాటకకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ నుంచి ఈరోజు ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో బెలగావికి సీఎం రేవంత్ రెడ్డి బయల్దేరనున్నారు. మహాత్మా గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బెలగావిలో సీడబ్ల్యూసీ 26, 27వ తేదీల్లో ఈ ప్రత్యేక సమావేశాలను గ్రాండ్‌గా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తునారు. ఈ సమావేశంలో సీఎంలు, మాజీ సీఎంలు, ఇతర సీనియర్ నేతలు కలిపి 200 మంది కీలక నేతలు పాల్గొంటారు.