News June 2, 2024
HYD: మీ సలహాలను మాతో పంచుకోండి!
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజల నుంచి ట్రాఫిక్ తగ్గించడం, జంక్షన్ డెవలప్మెంట్, కార్ పూలింగ్, రైడ్ షేరింగ్, ట్రాఫిక్ సంబంధిత సమస్యలపై సలహాలు, సూచనలను స్వీకరించనున్నట్లు తెలిపారు. మీ అమూల్యమైన ఐడియాలను 7569311356 వాట్సప్, Cyberabad Traffic police X అకౌంట్, @Cyberabadtrafficpolice ఫేస్ బుక్ అకౌంట్‌కు తెలపవచ్చని పేర్కొన్నారు.
Similar News
News September 16, 2024
HYD: ఖైరతాబాద్ గణేష్ మండపం తొలగింపు షురూ!
HYD నగరంలో ఖైరతాబాద్ వినాయకుడు వద్ద నిమజ్జన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఇప్పటికే భక్తులకు దర్శనాలు నిలిపివేసి,మండప తొలగింపు పనులు చేపట్టారు.సమయానికి పనులు అయ్యేలా చూడాలని నిర్వాహకులకు మంత్రి సూచించారు.ఖైరతాబాద్ సప్తముఖ గణనాథుడు ఈ రోజు సాయంత్రం టస్కర్ మీదకు వెల్డింగ్ పనులు చేయనుండడంతో సమయానికి పూర్తి చేసేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News September 16, 2024
రేపే నిమజ్జనం.. ఖైరతాబాద్ గణేశ్ ఎంత బరువంటే?
70 టన్నుల ఖైరతాబాద్ గణేశ్ రేపు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. కాగా విగ్రహ తయారీ అప్పుడు 30 టన్నుల స్టీలు, గుజరాత్ గాంధీనగర్ నుంచి 35 కిలోల బరువున్న ప్రత్యేక మట్టి 1000 బ్యాగులు, 50 కిలోల బరువున్న 100 బండిళ్ల వరి గడ్డి, 10 కిలోల బరువున్న వరి పొట్టు 60 బస్తాలు, 10 ట్రాలీల సన్న ఇసుక, 2 వేల మీటర్ల గోనె బట్ట, 80 కిలోల సుతిలీ తాడు, 5 వేల మీటర్ల మెష్, 2500 మీటర్ల కోరా బట్ట, టన్ను సుతిలీ పౌడర్ వినియోగించారు.
News September 16, 2024
HYD: 17న లిబరేషన్ డే.. SPECIAL
HYD నగరంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో లిబరేషన్ డే కోసం ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. రేపు నిర్వహించే వేడుకల్లో CAPF, డిఫెన్స్ పోలీసుల మార్చ్, 5 రకాల డ్రం డాన్సులు, డిజిటల్ ఎగ్జిబిషన్, 800+ఫోక్ అండ్ ట్రెడిషనల్ కళల నృత్య ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వెల్లడించింది.