News March 15, 2025
HYD: ముప్పుగా మారుతున్న స్టంట్స్

రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి PVNR ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 276 వద్ద నుంచి డైరీ ఫామ్ రూట్లో కొంతమంది మైనర్లు నాలుగు వాహనాలపై ప్రమాదకరమైన ఫీట్లు (స్టంట్స్) చేస్తున్నారు. వీరి విన్యాసాలను చూసిన ఇతర వాహనదారులు భయపడుతున్నారు. ప్రమాదాలు జరగక ముందే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.
Similar News
News March 16, 2025
ఓయూలో ఏకమవుతున్న విద్యార్థి సంఘాలు !

ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించకూడదని అధికారులు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా అన్ని విద్యార్థి సంఘాలు ఏకమవుతున్నాయి. ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం సమావేశమయ్యారు.
News March 16, 2025
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ట్రైబల్ యూనివర్శిటీ వీసీ

సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ వైఎల్. శ్రీనివాస్ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని శ్రీనివాస్ శాలువాతో సన్మానించి సత్కరించారు. మొట్టమొదటి, నూతన వీసీగా నియామకమైన శ్రీనివాస్కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలని సూచించారు.
News March 16, 2025
మహిళల ఆరోగ్యమే సమాజానికి ఆరోగ్యం: మంత్రి జూపల్లి

మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా, సుసంపన్నంగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం అవని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవోదయ కాలనీలోని (కూకట్పల్లి) తులసివనం వద్ద 5K రన్ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. మహిళలు కుటుంబంతో పాటు తమ ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.