News March 15, 2025
HYD: ముప్పుగా మారుతున్న స్టంట్స్

రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి PVNR ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 276 వద్ద నుంచి డైరీ ఫామ్ రూట్లో కొంతమంది మైనర్లు నాలుగు వాహనాలపై ప్రమాదకరమైన ఫీట్లు (స్టంట్స్) చేస్తున్నారు. వీరి విన్యాసాలను చూసిన ఇతర వాహనదారులు భయపడుతున్నారు. ప్రమాదాలు జరగక ముందే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.
Similar News
News November 28, 2025
మెదక్: తాత్కాలికంగా ప్రజావాణి వాయిదా

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం తెలిపారు. హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే ఫిర్యాదులు స్వీకరించబడునున్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
News November 28, 2025
కొమురం భీం జిల్లా SC-ST టీచర్స్ ఫెడరేషన్ కమిటీ ఎన్నిక

ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ కొమురం భీం జిల్లా శాఖ 2026-28 పదవీకాలానికి ఎన్నికలు రెబ్బెన జడ్పీహెచ్ఎస్లో రాష్ట్ర సలహాదారు జాడి కేశవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి చరణ్ దాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అధ్యక్షుడిగా దుర్గం తులసిరామ్, ప్రధాన కార్యదర్శిగా వడ్లూరి రాజేష్ ఎంపికయ్యారు. ఉపాధ్యాయుల సమస్యలు, రిజర్వేషన్ల అమలు, అంబేడ్కర్ భావాల సాధనకు కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు.
News November 28, 2025
నల్గొండ జిల్లాలో ఇవాళ్టి టాప్ న్యూస్

✓మర్రిగూడ: నగదు ఎలా స్వీకరిస్తున్నారు.. ఇలా త్రిపాఠి వాకబు
✓చెర్వుగట్టు హుండీ ఆదాయం లెక్కింపు
✓చండూరు: కుల ధృవీకరణ కోసం పడిగాపులు
✓మిర్యాలగూడ: భర్త ఇంటి ముందు భార్య ఆందోళన
✓నల్గొండ: కుక్కల స్వైర విహారం.. 22 గొర్రెల మృతి
✓కట్టంగూరు: కాంగ్రెస్లో బయటపడ్డ వర్గ విభేదాలు
✓చిట్యాల: అప్పుడు వార్డు మెంబర్.. ఇప్పడు మండలి ఛైర్మన్


