News March 15, 2025

HYD: ముప్పుగా మారుతున్న స్టంట్స్

image

రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి PVNR ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 276 వద్ద నుంచి డైరీ ఫామ్ రూట్లో కొంతమంది మైనర్లు నాలుగు వాహనాలపై ప్రమాదకరమైన ఫీట్లు (స్టంట్స్) చేస్తున్నారు. వీరి విన్యాసాలను చూసిన ఇతర వాహనదారులు భయపడుతున్నారు. ప్రమాదాలు జరగక ముందే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.

Similar News

News April 24, 2025

అండమాన్‌లో మున్సిపల్ ఛైర్మన్ పదవి టీడీపీ కైవసం

image

అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. బీజేపీ మద్దతుతో సౌత్ అండమాన్‌లోని శ్రీవిజయపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. 24 మంది సభ్యులున్న కౌన్సిల్‌లో టీడీపీ 15 ఓట్లు రాబట్టి ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి సాహుల్ హమీద్‌ గెలుపొందారు.

News April 24, 2025

భారత్, పాక్ సైనిక బలాలివే!

image

భారత్, పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో 2 దేశాల వద్ద ఉన్న సైనిక బలాలేంటో తెలుసుకుందాం.
♦ ఆర్మీ సైనికులు: 14,55,550 (భారత్), 6,54,000 (పాక్)
♦ వైమానిక ట్యాంకర్లు: 6 (భారత్), 4 (పాక్)
♦ అణు జలాంతర్గాములు: 293(భారత్), 121 (పాక్)
భారత్→ 2,299 ఎయిర్ క్రాఫ్ట్స్, 513 జెట్స్
పాక్→ 1,399 ఎయిర్ క్రాఫ్ట్స్, 328 జెట్స్
▶ అలాగే, భారత్ వద్ద 1.15M రిజర్వ్, 25 లక్షల పారా మిలిటరీ బలగాలున్నాయి.

News April 24, 2025

తారాబు జలపాతం వద్ద పెందుర్తి విద్యార్థి గల్లంతు

image

పెందుర్తిలోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థి తారాబు జలపాతంలో గల్లంతైనట్లు ఎస్‌ఐ రమణ తెలిపారు. నలుగురు యువకులు గురువారం జలపాతానికి వచ్చినట్లు చెప్పారు. వీరిలో వెస్ట్ గోదావరి జిల్లా భీమడోలుకి చెందిన గొన్నూరి కిషోర్ (22) జలపాతంలో ఈత కొడుతూ గల్లంతయ్యాడని తెలిపారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా కిషోర్ ఆచూకీ లభ్యం కాలేదని వెల్లడించారు.

error: Content is protected !!