News May 5, 2024

HYD: మురుగు కూపంగా హుస్సేన్ సాగర్.. చర్యలేవి?

image

HYD హుస్సేన్ సాగర్ మురుగు కూపంగా మారుతోంది. నిత్యం నాలాల నుంచి వస్తోన్న వ్యర్థాలు సాగర్ ఒడ్డున ఎక్కడికక్కడ పేరుకు పోతున్నాయి. రోజు రోజుకు హుస్సేన్ సాగర్ నీటి నాణ్యత పడిపోతోంది. నీటిలో కరిగి ఉండాల్సిన ఆక్సిజన్ 4MG కాగా.. తాజాగా పీసీబీ విడుదల చేసిన నివేదిక ప్రకారం, అంతకు తక్కువగా 3.2MG నమోదైంది. నీటిలో కరిగి ఉండే O2 శాతం తగ్గటం వల్ల జలచరాలు మరణించే ప్రమాదం ఉంది.

Similar News

News October 15, 2025

HYD: ‘₹4,000 పెన్షన్ వస్తుందా!.. అందిరికీ తెల్సిందేగా’

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS ప్రచారం ఉపందుకుంది. మంగళవారం కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, నాయకులు రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి ఎర్రగడ్డ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిళను ₹4,000 పెన్షన్ వస్తుందా? అని అడగ్గా ఆమె నవ్వుతూ ‘అందరికీ తెలిసిందేగా’ అని ఎద్దేవా చేశారు. ప్రజలు మళ్లీ కాంగ్రెస్ మాటలను నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు.

News October 15, 2025

HYD: రైళ్లలో బాణసంచా.. తీసుకెళ్తే తప్పదిక శిక్ష

image

దీపావళి సందర్భంగా రైల్వే శాఖ అప్రమత్తమైంది. బాణసంచాను రైల్లో తీసుకెళ్లొద్దని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులను హెచ్చరిస్తోంది. రైల్వే చట్టం 1989లోని సెక్షన్‌ 164, 165 ప్రకారం రూ.1000 వరకు జరిమానా లేదా 3ఏళ్ల జైలు శిక్ష, రెండూ వర్తించే అవకాశం ఉందంటున్నారు. ఎవరైనా రైల్లో తీసుకెళ్తే RPF పోలీసులకు లేదా 139 నంబర్‌కు సమాచారం అందించాలని రైల్వే అధికారులు సూచించారు..

News October 15, 2025

జూబ్లీలో వేడి రాజుకుంది.. బీజేపీ గమ్మునుంది

image

జూబ్లీహిల్స్ బైపోల్ వేడి రాజుకుంది. కానీ ఈ పోరులోకి BJP ఎంట్రీ ఇవ్వకపోగా అభ్యర్థి ప్రకటనపై సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ముగ్గురు పేర్లు చీఫ్ రాంచందర్‌రెడ్డి, అగ్రనేతలు షార్ట్‌లిస్ట్ చేశారు. వీరిలో దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, డా.పద్మ పేర్లు ఉన్నట్లు సమాచారం. బీసీ నేత అయితే బాగుంటుందని ఢిల్లీ పెద్దల యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి ప్రకటనపై పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది.