News January 28, 2025

HYD: ముసుగు దొంగలు.. జర జాగ్రత్త..!

image

గ్రేటర్ HYDలో ముసుగు దొంగలు హల్‌చల్ సృష్టిస్తున్నారు. ఘట్‌కేసర్ PS పరిధి అంకుషాపూర్‌లో వారం రోజులుగా రాత్రిపూట ముసుగు ధరించి ఓ ముఠా గల్లీల్లో తిరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ముసుగులు వేసుకుని దొంగలు సంచరిస్తుండడంతో రాత్రివేళలో బయట తిరగాలంటే భయపడుతున్నామని వాపోతున్నారు. గ్రేటర్ HYDలో రాత్రిళ్లు పెట్రోలింగ్ పెంచాలని HYD, సైబరాబాద్, రాచకొండ పోలీసులను ప్రజలు కోరుతున్నారు. 

Similar News

News October 28, 2025

ఇతిహాసాలు క్విజ్ – 49

image

1. శ్రీరామదాసుగా ప్రసిద్ధి చెందిన రామ భక్తుడు ఎవరు?
2. భూలోకానికి పైన ఉండే మొదటి లోకం ఏది?
3. రామ సేతువు నిర్మాణంలో ప్రధాన ఇంజినీర్లు ఎవరు?
4. యుద్ధాన్ని చూస్తూ దాన్ని ధృతరాష్ట్రునికి వివరించింది ఎవరు?
5. శివుడు తన జటాజూటంలో బంధించిన నది ఏది?
✑ సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 28, 2025

అక్టోబరు ఆఖరు నుంచి మామిడి చెట్లకు నీరు వద్దు

image

మామిడిలో మంచి పూత రావాలంటే రైతులు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అందులో భాగంగా ఇప్పటికే చెట్లకు పోషకాలు అందించాల్సి ఉంటుంది. ఈ నెల చివరి నుంచి మామిడి చెట్లు నిద్రావస్థలో ఉంటాయి. అందుకే ఈ నెలాఖరు నుంచి మామిడి చెట్లకు నీరు పెట్టడం పూర్తిగా ఆపేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాలంలో చెట్లకు నీరు పెట్టడం వల్ల చెట్ల రెమ్మల్లో కొత్త ఇగుర్లు వచ్చి పూత రాకుండా పోతుందని చెబుతున్నారు.

News October 28, 2025

CCRHలో 31 పోస్టులు..

image

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి 31 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు నవంబర్ 6 నుంచి 10 వరకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. కన్సల్టెంట్ పోస్టులకు నవంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని స్పీడ్ పోస్ట్ చేయాలి. వెబ్‌సైట్: https://ccrhindia.ayush.gov.in/