News March 21, 2025
HYD: మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు నీటితొట్లు

మూగజీవాల పట్ల దయ కలిగి ఉండాలని ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ మందుమూల రజిత పరమేశ్వర్ రెడ్డి అన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మూగజీవాల దాహార్తిని తీర్చేందుకై జీహెచ్ఎంసీ వారి ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నీటి తొట్లను ఆమె ఇవాళ పరిశీలించారు. డిప్యూటీ వెటర్నరీ డైరెక్టర్ డాక్టర్ రంజిత్, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
Similar News
News April 1, 2025
HYD: కారులో జర్మనీ యువతితో అసభ్య ప్రవర్తన

మీర్‌పేటలో కలకలం రేగింది. తన స్నేహితురాలిని కలిసేందుకు వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో జర్మనీకి చెందిన యువతి మందమల్లమ్మ వద్ద కారు ఎక్కింది. కొద్దిదూరం వెళ్లాక క్యాబ్ డ్రైవర్, అందులో ఉన్న వ్యక్తి పహాడిషరీఫ్ ప్రాంతంలో ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించారు. బాధితురాలు తప్పించుకొని పారిపోయింది. మీర్‌పేట PSలో ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేసి పహాడీషరీఫ్ పోలీసులకు బదిలీచేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 1, 2025
HYD ఊపిరి ఆగుతుందని స్లోగన్స్

HCUలో ప్రభుత్వ దామనకాండ అంటూ KBR పార్కు దగ్గర బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ‘ప్రకృతిని కాపాడండి.. అది మనల్ని కాపాడుతుంది. HCU అడవిని నరికితే.. హైదరాబాద్ ఊపిరి ఆగుతుంది’ అంటూ బీఆర్ఎస్వీ నాయకులు నినాదాలు చేశారు. ఈ నిరసనకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ప్రకృతి ప్రేమికులు, మద్దతు తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
News March 31, 2025
రంజాన్.. HYDలో వీటికి ఫుల్ DEMAND

HYD నగరంలో రంజాన్ పండుగ వేళ బిర్యానీ, క్యాబ్స్, బుకింగ్ ఆటోలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పండగ కావడంతో రెడ్ హిల్స్ లాంటి అనేక ప్రాంతాల్లో ముస్లిం ఆటో డ్రైవర్లు సెలవు తీసుకున్నారు. మరోవైపు పండగ వేళ నగరంలో రద్దీగా ఉండడంతో సాధారణ రోజులతో పోలిస్తే బుకింగ్ ఆటోలకు 20 నుంచి 30 శాతం అధికంగా చార్జీలు పడుతున్నట్లు ప్రయాణికులు తెలిపారు. ఆన్‌లైన్ ఆర్డర్లతో రెస్టారెంట్లు, హోటల్స్ కిక్కిరిస్తున్నాయి.