News July 25, 2024

HYD: మూడో తరగతి చదువుతున్న అంధ బాలికపై అత్యాచారం!

image

HYDలో దారుణ ఘటన జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. వికారాబాద్ జిల్లాకు చెందిన అంధ బాలిక(8) మలక్‌పేట్ ప్రభుత్వ అంధ బాలికల హాస్టల్‌లో మూడో తరగతి చదువుతోంది. ఇటీవల చిన్నారికి రక్తస్రావం కావడంతో హాస్టల్ సిబ్బంది, తల్లిదండ్రులు కలిసి ఆమెను వైద్యులకు చూపించారు. బాలికపై అత్యాచారం జరిగిందని వారు నిర్ధారించారు. బాత్‌రూమ్‌లు క్లీన్ చేసే యువకుడి(23)పై అనుమానంతో PSలో ఫిర్యాదు చేశారు.

Similar News

News November 20, 2025

షుగర్ కేసులు.. దేశంలోనే హైదరాబాద్ నం.4

image

దేశంలో డయాబెటిస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజా నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు అధికంగా ఉన్న నగరాల్లో HYD 4వ స్థానంలో నిలిచింది. జీవనశైలి, ఒత్తిడి, వ్యాయామం తగ్గడం, జంక్‌ఫుడ్, అధికంగా కార్బ్స్ తీసుకోవడం దీనికి ప్రధాన కారణాలని వైద్యులు తెలిపారు. గొంతు తడారడం, తరచూ మూత్ర విసర్జన, శరీర బరువు తగ్గటం, అలసటగా ఉంటే అశ్రద్ధ చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

News November 20, 2025

HYD: ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకోనున్న సీసీఎస్ పోలీసులు

image

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ మూవీ రాకెట్‌ ఐబొమ్మ కేసులో అరెస్ట్ అయిన ఇమ్మడి రవిని నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. వారం రోజులు రవిని కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా 5 రోజులకు అనుమతి ఇచ్చింది. రవిని నేడు చంచల్‌గూడ జైలు నుంచి సీసీఎస్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు.

News November 20, 2025

HYD: ట్రేడ్ లైసెన్స్ గడువు పొడిగింపు

image

ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్, కొత్త దరఖాస్తుల గడువును GHMC పొడిగించింది. డిసెంబర్ 1 వరకు ఉన్న గడువును MCC కారణంగా డిసెంబర్ 20వ తేదీ వరకు పొడిగిస్తూ కమిషనర్ బుధవారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీంతో వ్యాపారులు ఎటువంటి పెనాల్టీ లేకుండా డిసెంబర్ 20 వరకు తమ దరఖాస్తులను ఆన్‌లైన్, మీ-సేవ కేంద్రాల ద్వారా సమర్పించవచ్చు. లైసెన్స్ లేని వ్యాపారాలపై 100% జరిమానాతోపాటు ప్రతినెల 10% అపరాధ రుసుము వసూలు చేస్తారు.