News February 11, 2025
HYD: మూసీకి రూ.37.50 కోట్లు కేటాయింపు!

మూసీ నది అభివృద్ధి సంస్థకు రూ.37.50 కోట్లు కేటాయిస్తూ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. మూసీ ప్రక్షాళన అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులను తరలించేందుకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 1,500 కుటుంబాలను గుర్తించారు. ఒక్కో కుటుంబానికి రూ.25,000 అందించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News September 16, 2025
MIM- జూబ్లీహిల్స్ ఎన్నికలతో బిహార్ ఎన్నికలకు లింక్

బిహార్ ఎన్నికలకు, జూబ్లిహిల్స్ ఉపఎన్నికలకు అధికారికంగా లింకు లేకపోయినా MIM మాత్రం లింక్ పెడుతోంది. బిహార్లో కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి హాఘట్ బంధన్ కూటమిని ఏర్పాటు చేస్తున్నాయి. అందులో MIM చేరితే ఇక్కడ ఆ పార్టీ పోటీలో ఉండకకపోవచ్చు. ఒకవేళ కూటమిలో చేరకపోతే MIM కచ్చితంగా పోటీచేస్తుంది. ఇదీ MIM అధినేత ఆలోచన అని సమాచారం. ఈ పొలిటికల్ ఈక్వేషన్ క్లారిటీ కోసం కొద్ది రోజులు ఆగాల్సిందే.
News September 16, 2025
మహానగరంలో ఇవీ మా సమస్యలు

గ్రేటర్ వ్యాప్తంగా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యలు పరిష్కరించాలని 219 మంది వినతిపత్రాలు అందజేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 68 వివిధ సమస్యలపై ఫిర్యాదుచేశారు. అలాగే గ్రేటర్ పరిధిలోఉన్న ఆరు జోన్లలో 151 ఫిర్యాదులు వచ్చాయి. కూకట్పల్లిజోన్లో 55, సికింద్రాబాద్ 33, శేరిలింగంపల్లి 30, ఎల్బీనగర్ 15, చార్మినార్ 11, ఖైరతాబాద్ 7 ఫిర్యాదులు వచ్చాయని GHMC అధికారులు తెలిపారు.
News September 16, 2025
HYD: బదులేనిదీ ప్రశ్న.. పిల్లలకెందుకీ శిక్ష?

ఓల్డ్ బోయిన్పల్లిలోని మేధా స్కూల్లో డ్రగ్స్ తయారీ చేస్తుండటంతో పాఠశాలను అధికారులు సీజ్ చేశారు. దీంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యజమాని చేసిన తప్పుకు అతడిని శిక్షించి పాఠశాల నిర్వహణను వేరేవారికి ఇవ్వవచ్చు కదా అనేది తల్లిదండ్రుల ప్రశ్న. జరిగింది ముమ్మాటికీ తప్పే.. దీనికి విద్యార్థులను ఎందుకు శిక్షించడం అనేది తల్లిదండ్రుల వర్షన్. అధికారులేమో ప్రత్యామ్నాయం చూపిస్తాం అంటున్నారు.