News February 11, 2025
HYD: మూసీకి రూ.37.50 కోట్లు కేటాయింపు!

మూసీ నది అభివృద్ధి సంస్థకు రూ.37.50 కోట్లు కేటాయిస్తూ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. మూసీ ప్రక్షాళన అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులను తరలించేందుకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 1,500 కుటుంబాలను గుర్తించారు. ఒక్కో కుటుంబానికి రూ.25,000 అందించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 28, 2025
HYD: కూతురిని హత్య చేసిన తల్లి

కూతురిని తల్లి హత్య చేసిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. తమిళనాడుకు చెందిన ముదులై మణి, ఆరోగ్య విజ్జి దంపతులు. భర్త మణికి 2 మూత్రపిండాలు పాడవగా.. 15 రోజుల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఆమె పెద్దయ్యాక పెళ్లి ఖర్చులు ఉంటాయని భావించి మంగళవారం నీళ్ల బకెట్‌లో వేయడంతో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
News March 28, 2025
హైదరాబాద్‌లో ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు

రంజాన్ చివరి శుక్రవారం మక్కా మసీదులో ప్రార్థనలకు ముస్లిం సోదరులు భారీగా రానుండటంతో పోలీసులు HYDలో ఆంక్షలు విధించారు. చార్మినార్ పరిసర ప్రాంతాలకు వచ్చే రోడ్లన్నింటినీ ఉ.8 నుంచి సా.4వరకు మూసేస్తున్నారు. చార్మినార్‌కు వచ్చే నయాపూల్ నుంచి మదీనా, శాలిబండ- హిమ్మత్‌పుర, చౌక్‌మైదాన్-మొగల్‌పుర, మీర్ఆలం మండీ/బీబీ బజార్, మూసాబౌలి- మోతీహాల్, గన్సీబజార్- హైకోర్టు రోడ్డుకు వాహనాలు మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు.
News March 28, 2025
కళకళలాడుతోన్న చార్మినార్

అర్ధరాత్రి చార్మినార్ కళకళలాడుతోంది. రంజాన్ మాసంలో నేడు చివరి శుక్రవారం కావడంతో మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల(అల్ విధా జుమ్మా) కోసం ఏర్పాట్లు చేశారు. పండుగకు మరో రెండ్రోజులే సమయం ఉండటంతో జనాలు షాపింగ్ కోసం క్యూకట్టారు. కమాన్ రోడ్, భాగ్యలక్ష్మీ టెంపుల్ రోడ్, లాడ్ బజార్, న్యూ లాడ్ బజార్, రాత్‌ఖానా గల్లీ, మోతీ గల్లీలు కిక్కిరిసిపోయాయి. వాహనాలు పార్కింగ్‌కు స్థలం దొరకని పరిస్థితి నెలకొంది.