News August 28, 2024

HYD: మూసీనదికి 50 మీటర్ల బఫర్ జోన్ ఖరారు!

image

మూసీనదికి 50 మీటర్ల బఫర్ జోన్ సరిహద్దుగా నిర్ణయించి నిర్మాణాలకు NOC పత్రాలు జారీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్ HYD పరిధిలో మూసీకి ఇరువైపులా పలు భారీ నిర్మాణాలకు సంబంధించిన దరఖాస్తులు LOCల కోసం పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది. బఫర్ జోన్ నిర్ణయంతో.. మూసికి 50 మీటర్ల సరిహద్దు వరకు నిర్మించిన అక్రమ నిర్మాణాలను త్వరలో కూల్చివేయనున్నారు.

Similar News

News December 9, 2024

HYD: సీసీటీవీల నిర్వహణకు నిధులు కేటాయిస్తాం: బిర్లా గ్రూప్

image

రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో నేర నియంత్రణ కోసం సీసీటీవీల నిర్వహణకు నిధులు కేటాయిస్తామని ఆదిత్య బిర్లా గ్రూపు వైస్ ఛైర్మన్ రాజశ్రీ తెలిపారు. రాచకొండ సీపీ సుధీర్ బాబుతో సోమవారం రాజశ్రీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనరేట్ భౌగోళిక పరిస్థితులు, నేర నియంత్రణ విధానాలు, షీ టీమ్స్ పనితీరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.

News December 9, 2024

HYD: వ్యవసాయ విశ్వవిద్యాలయ వజ్రోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

image

ఈనెల 20, 21 తేదీల్లో జరగనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయ వజ్రోత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఆహ్వానించారు. శాసనసభ ఆవరణలో సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన జానయ్య ఆహ్వాన పత్రికను అందించారు. ఉత్సవాలకు హాజరు కావడంపై సీఎం సానుకూలంగా స్పందించారు.

News December 9, 2024

RR: టీకా వాహనాలను ప్రారంభించిన కలెక్టర్

image

సంచార టీకా ద్విచక్ర వాహనాలను సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ వాహనాలు పల్లెలు, పట్టణాలు, జన సంచార ప్రాంతాలలోకి చేరుకొని పిల్లలు, గర్భిణీలకు నూరు శాతం టీకాలు ఇచ్చేందుకు దోహదపడతాయని చెప్పారు. డీఎంహెచ్వో వెంకటేశ్వరరావు, జిల్లా ఇమ్యు నైజేషన్ అధికారి షీభహయత్, డిప్యూటీ డిఎంహెచ్ఓ రాకేశ్, డీపీఓ అక్రమ్ పాల్గొన్నారు.