News February 26, 2026

HYD: మూసీ ప్రక్షాళన.. అసలు కథ ఇదే!

image

మూసీ ప్రక్షాళనలో ‘మార్కింగ్’ వ్యవహారం కలకలం రేపుతోంది. FTL పరిధిలోని 40కి పైగా భారీ కమర్షియల్ నిర్మాణాలను కూల్చకుండా, భారీ జరిమానాలతో రెగ్యులరైజ్ చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. నది వెడల్పు తగ్గించి, PPP పద్ధతిలో ఖరీదైన భూములను రియల్టర్లకు కట్టబెట్టే మాస్టర్ ప్లాన్ సిద్ధమైనట్లు విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల సామాన్యుల ఇళ్లు పోయి, బడా వ్యాపారులకు మేలు జరుగుతుందనే చర్చ జోరందుకుంది.

Similar News

News April 12, 2026

ఇంటర్ సెకండియర్‌లోనూ మేడ్చల్ FIRST

image

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. మేడ్చల్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 64,146 మంది పరీక్షలు రాయగా 53,071 మంది పాసై 82.73 శాతంతో స్టేట్‌లోనే ఫస్ట్‌ వచ్చింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 1,280 మందికి 922మంది పాసై 72.03%తో 23వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 6,106 మందికి 1,904 మంది పాసై 31.18%తో 21వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 95 మందికి 54 మంది పాసై 56.84%తో 10th ప్లేస్ వచ్చింది.

News April 12, 2026

ఇంటర్ సెకండియర్ RESULTS.. హనుమకొండకు 8వ ర్యాంక్

image

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. హనుమకొండ(D)లో రెగ్యులర్ విద్యార్థులు 17,435 మంది పరీక్షలు రాయగా 13,698 మంది పాసై 78.57 శాతంతో స్టేట్‌లోనే 8వ ర్యాంక్ వచ్చింది.ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 1003 మందికి 740 మంది పాసై 73.78 శాతంతో 19వ స్థానంలో నిలవగా, రెగ్యులర్ ప్రైవేట్‌లో 1537 మందికి 530 మంది పాసై 34.48%తో 13వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 35 మందికి 22 మంది పాసై 62.86%తో 7వ ర్యాంక్ వచ్చింది.

News April 12, 2026

అమరావతికి ₹3,165 కోట్లు ఇచ్చాం: WB

image

AP: అమరావతి అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ₹3,165 కోట్లు విడుదల చేసినట్లు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి వెల్లడించారు. పనుల పురోగతిని బట్టి దశలవారీగా మిగిలిన నిధులను విడుదల చేస్తామని తెలిపారు. 6ఏళ్ల గ్రేస్ పీరియడ్, 29 ఏళ్ల మెచ్యూరిటీతో లోన్ మంజూరు చేసినట్లు చెప్పారు. 2031 జూన్ 15 నుంచి రీపేమెంట్ గడువు స్టార్ట్ అవుతుందన్నారు. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనకు కేంద్రంగా మారేలా నగరానికి సహకరిస్తామని తెలిపారు.