News February 26, 2026

HYD: మూసీ సుందరీకరణ.. నిధుల కోసం ఢిల్లీ బాట!

image

మూసీ పునరుజ్జీవనంపై సర్కారు పట్టుదలతో ఉన్నా, నిధుల వేట సవాలుగా మారింది. రూ.17 వేల కోట్ల మాస్టర్ ప్లాన్‌కు కేంద్ర బడ్జెట్‌లో ఆశించిన మద్దతు లభించలేదు. దీంతో ప్రాజెక్టు అమలులో జాప్యం జరిగేలా కనిపిస్తోంది. సర్వేలు పూర్తయినా, భూసేకరణ, పునరావాసంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కావడంతో నిధుల కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.

Similar News

News April 16, 2026

దేవమ్మ మడుగులో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

image

దేవమ్మ మడుగులో ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కర్నూలు మండలం ఆర్.కె.దుద్యాల సమీపంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు. ఇసుక అక్రమ తరలింపు, నీటి నిల్వ సామర్థ్యం, తాగునీటి సమస్యలపై క్షేత్రస్థాయిలో ఆరా తీశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

News April 16, 2026

NTR: ద్విచక్రవాహనదారులు హెల్మెట్ క్లిప్ పెట్టుకోవాలి

image

బైక్ నడిపేవారు హెల్మెట్‌కు ఉండే క్లిప్‌ను తప్పనిసరిగా పెట్టుకోవాలని సీపీ రాజశేఖరబాబు హెచ్చరించారు. ఈ మేరకు ఆయన విజయవాడ పోలీస్ కమిషనరేట్ అధికారిక X ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేశారు. క్లిప్ పెట్టుకోకుండా హెల్మెట్ ధరించడం అంటే ప్రమాద సమయంలో అది తల నుంచి జారిపోవడానికి అవకాశం ఇవ్వడమేనన్నారు. ప్రాణాలను కాపాడేది సరిగా పెట్టుకున్న హెల్మెట్ మాత్రమేనన్న విషయం వాహనదారులు గుర్తుంచుకోవాలన్నారు.