News June 8, 2024

HYD: మృగశిర కార్తె.. చేపలకు ఫుల్ డిమాండ్

image

మృగశిర కార్తె సందర్భంగా ముషీరాబాద్ మార్కెట్‌‌కు భారీగా చేపలు దిగుమతి చేసుకుంటున్నారు వ్యాపారులు. సాధారణ రోజుల్లో 15 టన్నుల నుంచి 20 టన్నుల విక్రయాలు ఇక్కడ జరుగుతుంటాయి. శనివారం (మృగశిర కార్తె రోజు) 50 టన్నుల నుంచి 70 టన్నుల చేపలు అమ్ముడుపోతాయని వ్యాపారులు వెల్లడించారు. రేపు సండే కూడా గిరాకీ ఉంటుందన్నారు. మరోవైపు‌ నాంపల్లి‌ ఎగ్జిబిషన్‌లో‌ చేపమందు కోసం శుక్రవారం రాత్రి నుంచి క్యూకట్టారు.

Similar News

News October 21, 2025

KTR, హరీశ్ ‘హైదరాబాద్ యాత్ర’..!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవాలనే లక్ష్యంతో KTR, హరీశ్‌రావు రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను హైలైట్ చేయడానికి ఇద్దరు నాయకులు ‘హైదరాబాద్ యాత్ర’లో ఉన్నారు. HYDRAA, Musi ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలతో దీపావళిని జరుపుకున్న తర్వాత KTR, హరీశ్ ఈరోజు బస్తీ దవాఖానలను సందర్శించారు. 2026 ప్రారంభంలో GHMC ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున వారు సిటీపై మరింత ఫోకస్ పెట్టారు.

News October 21, 2025

HYDలో మహిళా శక్తికి రూ. 57 కోట్లతో నాలుగు హాస్టళ్లు!

image

​తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి ప్రాజెక్ట్ మహిళల ఆశలకు ఊపిరి పోస్తోంది. రూ. 57,56,31,404 అంచనా వ్యయంతో HYDలోని ఖైరతాబాద్, షేక్‌పేట్, ఆసిఫ్‌నగర్‌లో 4 అత్యాధునిక వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను నిర్మించనుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో ఉద్యోగాలు చేసుకునే మహిళలకు ఇవి భరోసా కల్పించనున్నాయి. సురక్షిత, సౌకర్యవంతమైన వసతి కల్పించనున్నారు. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

News October 21, 2025

జూబ్లీ బైపోల్.. నేటితో నామినేషన్ల గడువు పూర్తి

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 127 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. 24న ఉపసంహరణకు తుది గడువు. నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.