News February 11, 2025
HYD: మృతుల కుటుంబాలకు మంత్రి సానుభూతి

మధ్యప్రదేశ్ జబల్‌పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు హైదరాబాద్ వాసులు మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశామన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులను అక్కడి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని, సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News October 29, 2025
తుఫాన్ ప్రభావంతో పెద్దపల్లి పత్తి మార్కెట్ బంద్

తుఫాన్ కారణంగా అకాల వర్షాలు కురుస్తుండటంతో పత్తి తూకం, లోడింగ్ పనుల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రకటించింది. ఈ కారణంగా యార్డు గురువారం నుంచి శుక్రవారం వరకు మూతపడి ఉంటుందని పేర్కొంది. వాతావరణం అనుకూలిస్తే సోమవారం నుంచి పత్తి కొనుగోళ్ల కార్యకలాపాలు పునః ప్రారంభం అవుతాయని ఉన్నత శ్రేణి కార్యదర్శి తెలిపారు.
News October 29, 2025
పన్ను వసూళ్లపై కఠినంగా వ్యవహరించాలి: కలెక్టర్

పంచాయతీరాజ్ శాఖ పనితీరుపై అధికారులతో కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీక్ష నిర్వహించి NOV 1-7 వరకు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధం విధించాలని కోరారు. చెత్తసేకరణ, నీటినిల్వ నివారణ, పన్ను వసూళ్లు, తాగునీటి సరఫరాపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అనుమతిలేని నిర్మాణాలపై చర్యలుంటాయని అన్నారు.
News October 29, 2025
ఎల్లంపల్లి ప్రాజెక్ట్.. 9 గేట్ల ద్వారా నీటివిడుదల

ఎగువన కురిసిన వర్షాలకు నీటి ప్రవాహం పెరగడంతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 148.00 మీటర్లుగా, నీటి నిల్వ 20.1754 టీఎంసీలుగా నమోదైంది. మొత్తం ఇన్‌ఫ్లో 73,089 క్యూసెక్కులు కాగా, అంతే అవుట్‌ఫ్లో కొనసాగుతోంది. ఇందులో శ్రీరాం సాగర్ నుంచి 50,000, కడెం నుంచి 4,744 క్యూసెక్కుల ప్రవాహం ప్రవేశిస్తోంది. ప్రాజెక్ట్‌లో 62 గేట్లలో 9 గేట్లు తెరిచి 72,801 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.


