News February 26, 2026

HYD: మెగా జాబ్ మేళా

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ విత్ ఇంటెలెక్ట్యువల్ డిసెబిలిటీస్ ఆధ్వర్యంలో యూత్4 జాబ్స్ సాకారంతో దివ్యాంగుల కోసం ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించనున్నారు. 27 FEB 2026న సికింద్రాబాద్‌లోని NIEPID క్యాంపస్‌లో ఈ మేళా జరగనుంది. అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్‌కార్డు, దివ్యాంగ ధ్రువీకరణపత్రం లేదా UDID కార్డు, విద్యార్హత సర్టిఫికేట్లు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకురావాలి.

Similar News

News April 15, 2026

యుద్ధం వేళ డిజిటల్ బంగారంపై పెరిగిన నమ్మకం!

image

ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు నెలకొన్న వేళ ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు. స్టాక్ మార్కెట్ల ఊగిసలాటల మధ్య రిస్క్ లేని పెట్టుబడి కోసం గోల్డ్ ETFలను ఆశ్రయిస్తున్నారు. ఈ ఏడాది తొలి 3 నెలల్లో ఏకంగా ₹31,561 కోట్లు ఈ ఫండ్లలోకి చేరాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 6రెట్లు పెరగడం గమనిస్తే.. ఇన్వెస్టర్లు భౌతిక బంగారం కంటే డిజిటల్ పసిడి వైపే అట్రాక్ట్ అవుతున్నట్లు స్పష్టమవుతోంది.

News April 15, 2026

అంబటికి పోలీసుల నోటీసులు

image

కడప జిల్లా వేంపల్లి పోలీసులు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నోటీసులు జారీ చేశారు. 2026 ఫిబ్రవరి 1న సింగారెడ్డి రామ మునిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నోటీసులు అందిన వారం రోజుల్లోగా వేంపల్లి స్టేషనుకు హాజరై దర్యాప్తుకు సహకరించాలని అధికారులు ఆదేశించారు.

News April 15, 2026

తాడిపత్రిలో కీచక అధికారి

image

తాడిపత్రి మున్సిపాలిటీలో ఓ కీలక అధికారి మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడుతుండటం కలకలం రేపుతోంది. సచివాలయ, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగినులను లక్ష్యంగా చేసుకొని అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాధితుల కుటుంబ సభ్యులు సదరు అధికారికి దేహశుద్ధి చేసినా తీరు మారలేదట. ఆ కీచక అధికారి వ్యవహారాలు బయటకు రాకుండా అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకొని తొక్కిపెడుతున్నారని బాధితులు వాపోతున్నారు.