News August 18, 2024

HYD మెట్రోలో ఇబ్బంది పడితే ఫిర్యాదు చేయండి..!

image

HYD మెట్రో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఇబ్బందులకు గురైతే వాటి వివరాలను వాట్సాప్ ద్వారా తెలపాలని అన్నారు. మెట్రోలో ఏసీ సరిగా రావడం లేదని ఓ వ్యక్తి తెలపగా, ప్రస్తుతం మెట్రోలో ఏసీ 22-24 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంచుతున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. వాట్సాప్ నంబర్ 7995999533 ద్వారా సమస్యలు తెలపాలని కోరారు. SHARE IT

Similar News

News October 14, 2025

FLASH: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తనిఖీల్లో రూ.25 లక్షలు పట్టివేత

image

HYD జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో భాగంగా స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ (SST) అమీర్‌పేట్ మైత్రీవనం ఎక్స్ రోడ్ వద్ద సారధి స్టూడియో సమీపంలో ఓ కారును తనిఖీ చేసింది. భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంది. జైరాం తలాసియా అనే వ్యక్తి కారులో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న రూ.25 లక్షల నగదును అధికారులు సీజ్ చేసి, తదుపరి చర్యల కోసం మధురానగర్ PS SHO ప్రభాకర్‌కు అప్పగించారు.

News October 14, 2025

HYD: హైడ్రా ప్రజావాణికి మొత్తం 48 ఫిర్యాదులు

image

హైడ్రా ప్రజావాణికి మొత్తం 48 ఫిర్యాదులు అందాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. హైదరాబాద్ బుద్ధ భవన్‌లో హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. లేఅవుట్లలో పార్కులు, డెడ్ ఎండ్ రోడ్ల కబ్జాలు, వరద కాలువల మలుపులు ప్రధాన అంశాలుగా ఉన్నాయన్నారు. రావిర్యాల పెద్ద చెరువు ప్రభావంపై ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. సంబంధిత అధికారులకు వాటి పరిష్కార బాధ్యతలను అప్పగించామన్నారు.

News October 14, 2025

HYD: తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఇన్‌ఛార్జుల నియామకం

image

తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జులను ఈరోజు నియమించింది. HYD ఇన్‌ఛార్జ్‌గా భావన వెంకటేశ్, ఉమ్మడి రంగారెడ్డి ఇన్‌ఛార్జ్‌గా సుధగాని హరిశంకర్ గౌడ్ నియమకమయ్యారు. ఆయా జిల్లాల్లోని మండలాలు, గ్రామాల వారీగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యవర్గాలను సకాలంలో నియమించాలని పేర్కొన్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర పార్టీ ఆఫీస్‌కు అందజేయాలని ఆదేశించారు.