News March 9, 2025

HYD: మెట్రోలో గుండె తరలించిన వైద్యులు

image

HYD మెట్రో అరుదైన ఘనత సొంత చేసుకుంది. ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి మెట్రోలో గుండెను తరలించారు. డయిలేటెడ్ కార్డియోమయోపతి సమస్యతో బాధపడుతున్న 44 ఏళ్ల వ్యక్తికి శనివారం ఎమర్జెన్సీ అవ్వగా వారు మెట్రోనే ఎంచుకున్నారు. వైద్యులు నాగోల్‌లో మెట్రో‌ ఎక్కి జూబ్లీహిల్స్‌లో దిగారు. ఇలా గుండెను తరలించడాన్ని గ్రీన్ ఛానల్ అంటారు.

Similar News

News March 10, 2025

విశాఖ హోటల్‌లో మహిళ మృతి.. నిందితుడు అరెస్ట్

image

విశాఖలోని ఓ హోటల్‌లో <<15698756>>మహిళ ఉరి<<>> వేసుకున్న ఘటనలో నిందితుడిని త్రీటౌన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. విశాఖలో ఉంటున్న పిళ్ల శ్రీధర్ (53)USAలో ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్నారు. అక్కడ ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె ఫిబ్రవరి 14న విశాఖ వచ్చింది. మార్చ్ 6న హోటల్ మేఘాలయలో కలవాలని అతను బలవంతం చేశాడు. హోటల్‌లో శ్రీధర్ ఆమెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని దీంతో ఆమె ఉరి వేసుకుందని విచారణలో తేలింది.

News March 10, 2025

వత్సవాయి: లవ్ ఫెయిల్యూర్.. యువతి ఆత్మహత్య

image

ప్రేమ విఫలమవడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన వత్సవాయి మండలం ఆలూరుపాడు గ్రామంలో జరిగింది. MS చదువుతున్న శ్రావణి(27)కి హైదరాబాద్‌కి చెందిన భానుప్రకాశ్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ప్రేమ విఫలమవడంతో శ్రావణి గడ్డి మందు తాగింది. తల్లిదండ్రులు హుటాహుటిన ఆమెను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. శ్రావణి ఆదివారం రాత్రి మరణించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

News March 10, 2025

కడప: వరల్డ్ నంబర్ 1 ర్యాంకింగ్ మనోడికే.!

image

ఉమ్మడి కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన గొబ్బూరి విశ్వతేజ బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయస్థాయిలో రాణిస్తూ సత్తాచాటుతున్నాడు. తాజాగా జూనియర్ వరల్డ్ ర్యాకింగ్స్ డబుల్స్ విభాగంలో గుంటూరుకు చెందిన అరిగెల భార్గవ్ రామ్‌తో కలిసి వరల్డ్ నెంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఈయన ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో 3 మెడల్స్ సాధించగా.. జాతీయస్థాయిలో 17 పతకాలు సాధించాడు. కడప బ్యాడ్మింటన్‌ సంఘం ప్రతినిధులు ఆయన్ను సత్కరించారు.

error: Content is protected !!