News May 3, 2024
HYD: మెట్రోలో 50 కోట్ల మంది ప్రయాణించారు..!

HYD మెట్రో రైలు మరో మైలురాయిని చేరుకుంది. ఇప్పటి వరకు 50 కోట్ల మంది ప్రయాణికులు మెట్రో రైళ్లలో ప్రయాణించినట్లు ఎండీ NVS రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు గ్రీన్ మైల్స్ లాయల్టీ క్లబ్‌ను ఆయన ఆవిష్కరించారు. రోజూ 5.5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారని, రెండో దశ రైలుకు డీపీఆర్‌లు సిద్ధమయ్యాయన్నారు. మెట్రోపై ప్రయాణికులకు నమ్మకం పెరిగిందన్నారు. మెట్రో రైలు వల్ల 14.5 కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అయిందన్నారు.
Similar News
News November 14, 2025
జూబ్లీహిల్స్ బై పోల్: అనుమానం వచ్చి ఫిర్యాదు చేస్తేనే VVPAT లెక్కింపు

మనం ఓటు వేసినపుడు ఓ స్లిప్ మనం ఎవరికి ఓటు వేశామో మనకు చూపించి ఆ తరువాత ఒక డబ్బాలో పడిపోతుంది. దానినే VVPAT అంటారు. ఆ స్లిప్పులను కౌంటింగ్ సమయంలో లెక్కించరు. అయితే పోలింగ్ శాతానికి, ఓట్లకూ లెక్క సరిపోవాలి. అలా కానిపక్షంలో ఏజెంట్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తారు. అప్పుడు ఆర్ఓతోపాటు సూపర్ వైజర్ VVPAT (Voter Verifiable Paper Audit Trail) ఓట్లను లెక్కిస్తారు.
News November 14, 2025
జూబ్లీబైపోల్: పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్‌కు 47 ఓట్లు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముగిసింది. పోస్టల్ బ్యాలెట్లో మొత్తం 101 మంది హోం ఓటింగ్ వేశారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 47 మంది ఓటేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 43 ఓట్లు పడ్డాయి. ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 11 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం మొదటి రౌండ్లో భాగంగా షేక్‌పేట బూత్‌ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
News November 14, 2025
హైదరాబాద్‌లో పెరుగుతున్న చలి తీవ్రత!

గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. నేడు తెల్లవారుజామున అత్యల్పంగా శేరిలింగంపల్లి HCU పరిసర ప్రాంతాల్లో 8.8C నమోదు కాగా, రాజేంద్రనగర్‌లో 10.7, BHEL 11.7, బొల్లారం, మారేడ్‌పల్లి, గచ్చిబౌలి 11.7, కుత్బుల్లాపూర్ 12.2, జీడిమెట్ల 12.7 సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. మరో నాలుగు రోజుల పాటు ఇలానే కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


