News April 3, 2024
HYD మెట్రో ప్రయాణికులకు BIG షాక్

HYD మెట్రో సూపర్ సేవర్ హాలిడే కార్డును తీసుకొచ్చి సెలవు దినాల్లో కేవలం రూ.59 రీఛార్జ్ ద్వారా అన్ లిమిటెడ్ ప్రయాణం చేయవచ్చని తెలిపింది. అయితే ఇటీవల కొందరు కార్డు కోసం వెళ్లగా ప్రయాణికులకు మెట్రో BIG షాక్ ఇచ్చింది. మెట్రో ప్రవేశపెట్టిన సూపర్ సేవర్ హాలిడే కార్డు, సూపర్ ఆఫ్ పీక్ హవర్ కార్డు సేవలు 2024 మార్చి 31 నాటికి ముగిశాయని తెలిపింది. ఆఫర్లు వర్తించవని తేల్చి చెప్పింది.
Similar News
News November 28, 2025
HYD: సిబ్బంది లేమి.. నియామకాలేవి: పద్మనాభరెడ్డి

రాష్ట్రంలోని 25 కొత్త ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది లేమి తీవ్రంగా ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సీఎంకి లేఖ రాసింది. 1,413 మంది కావాల్సిన చోట 111 మంది మాత్రమే పనిచేస్తున్నారని, 22 ఆస్పత్రుల్లో ఒక్క నియామకం జరగలేదని లేఖలో పేర్కొన్నారు. సిబ్బంది లేక దవాఖానాలు మూతబడి, వాటిలో కొన్ని చోట్ల అసాంఘిక చర్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 1,302 పోస్టులను భర్తీ చేసి ఆస్పత్రులు ప్రారంభించాలన్నారు.
News November 28, 2025
HYD: మంచినీరు వృథా చేస్తే.. కాల్ చేయండి!

HYDలో జలమండలి సరఫరా చేసే మంచినీటిని కార్లు, బైకులు కడగటానికి, రోడ్లు కడగటానికి ఉపయోగించడం, మోటార్లు పెట్టి నిర్మిస్తున్న ఇళ్లకు క్యూరింగ్ చేయడం లాంటివి చేస్తే కఠినంగా వ్యవహరించి భారీ జరిమానా వేస్తామని జలమండలి హెచ్చరించింది. ఎవరైనా చూస్తే వెంటనే ఫొటో తీసి, 155313, HMWSSB యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొంది.
News November 28, 2025
మెట్రో ప్రయాణికులకు స్మార్ట్ లాకర్ల సేవలు

L&T మెట్రో రైల్, TUCKITతో కలిసి HYDలోని మెట్రో స్టేషన్లలో స్మార్ట్ స్టోరేజ్ లాకర్ల సేవలను ప్రారంభించింది. ఇందులో లగేజీ, హెల్మెట్లు, షాపింగ్ బ్యాగ్లను భద్రపరుచుకుని హ్యాండ్స్ఫ్రీగా ప్రయాణించొచ్చు. QR కోడ్ స్కాన్ చేసి, లాకర్ సైజు ఎంచుకుని 30 సెకన్లలో డిజిటల్ పేమెంట్ చేయొచ్చు. మియాపూర్, అమీర్పేట్, పంజాగుట్ట, ఎల్బీనగర్, ఉప్పల్, పరేడ్ గ్రౌండ్, హైటెక్సిటీ స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.


