News December 21, 2024

HYD మెట్రో ఫేజ్ 2‌పై కీలక అప్‌డేట్

image

హైదరాబాద్ మెట్రో రైల్ భూసేకరణను అధికారులు వేగవంతం చేశారు. ఫేజ్-2, కారిడార్ VI- MGBS నుంచి చంద్రాయణగుట్ట వరకు 800 ఆస్తుల భూసేకరణ కొరకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. చదరపు గజానికి రూ.81,000 చొప్పున నష్టపరిహారం కట్టించేందుకు సిద్ధం అయ్యింది. సమ్మతించిన ఇంటి యజమానులకు పది రోజుల్లో నష్టపరిహారాన్ని అధికారులు ఇవ్వనున్నారు.

Similar News

News January 5, 2025

ప్రతి ఒక్కరిలో భగవంతుడున్నాడు: గవర్నర్

image

ప్రతి ఒక్కరిలో భగవంతుడున్నాడని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. పీయూఎన్ వర్మ, అమరవాణి ఫౌండర్ డాక్టర్ మదన్ మహరాజ్ గోసావి ఆధ్వర్యంలో రాజభవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన భాగ్యనగర్ భారతీయ సంస్కృతి సమ్మేళన్ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సనతాన ధర్మం అంటే ఎప్పటికప్పుడు తమలోని విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ కాలంతో పాటు ధర్మాన్ని ఆచరించడమేనని అన్నారు.

News January 5, 2025

HYD: హైడ్రాకు ఫిర్యాదు చేయాలా.. కాల్ చేయండి

image

ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. రాణిగంజ్‌లోని బుద్ధ భవన్‌లో ఉన్న హైడ్రా కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 11 గం. నుంచి మధ్యాహ్నం 2 గం. వరకు.. మధ్యాహ్నం 3 గం. నుంచి సాయంత్రం 5:30 గం. వరకు నేరుగా లేదా, 040-29565758, 29560596 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.

News January 5, 2025

HYDలో IT శిక్షణకు అడ్డాగా అమీర్‌పేట

image

హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) సంబంధిత కోర్సుల శిక్షణకు అమీర్‌పేట అడ్డాగా మారింది. 1992 నుంచి ఇక్కడ ఐటీ శిక్షణ కొనసాగుతోంది. పైథాన్, డాట్ నెట్, డిజిటల్ మార్కెటింగ్, జావా, సీ ప్లస్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్ వంటి విభిన్న కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన ఎంతో మంది ఐటీ కొలువుల్లో రాణిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?