News November 6, 2024
HYD: మెట్రో ముందడుగు.. GOOD NEWS
రాష్ట్ర ప్రభుత్వం రూ.2,741 కోట్ల అంచనాతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన HYD పాతబస్తీ మెట్రో (MGBS- చంద్రాయన గుట్ట)భూ సేకరణపై కలెక్టర్ అనుదీప్ మూడో విడత నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటికే 2 విడతల్లో 400 వరకు ఆస్తులను నోటిఫై చేశారు. తాజాగా.. దారుల్‌షిఫా నుంచి శాలిబండ వరకు సేకరించాల్సిన భూమిపై నోటిఫికేషన్ ఇచ్చారు. అభ్యంతరాలను 2025 జూన్ 2 వరకు బేగంపేట మెట్రో రైల్ కార్యాలయంలో అందించాలి.
Similar News
News December 9, 2024
REWIND: NIMSలో KCR దీక్ష విరమణ
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది. 29 NOV 2009లో కరీంనగర్‌లోని తెలంగాణభవన్ నుంచి సిద్దిపేటలోని దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. జైలులో దీక్ష చేయగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటనే NIMSకు తరలించారు. DEC 9న కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రావడంతో KCR NIMSలో దీక్ష విరమించారు.
News December 9, 2024
నేడు దద్దరిల్లనున్న హైదరాబాద్
ప్రజాపాలన విజయోత్సవాలు నేటితో ముగియనున్నాయి. HYD వేదికగా భారీగా ఏర్పాట్లు చేశారు. సెక్రటేరియట్‌లో ప్రభుత్వం నూతనంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తోంది. ఇదేరోజు దుండిగల్‌లో BRS కూడా విగ్రహావిష్కరణకు సిద్ధమైంది. దీనికి తోడు సోనియా గాంధీ జన్మదినం. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అభివృద్ధిపై కాంగ్రెస్, వైఫల్యాలు ఎత్తిచూపే ప్రతిపక్షాల ప్రసంగాలతో నేడు HYD దద్దరిల్లనుంది.
News December 9, 2024
హైదరాబాద్‌లో ‘Tiger Ka Hukum’
గతేడాది అధికారిక కార్యక్రమాలు, రాజకీయ ప్రసంగాలతో బిజీబిజీగా గడిపిన CM రేవంత్ రెడ్డి ఆదివారం కాస్త కూల్‌గా కనిపించారు. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా HYDలో నిర్వహించిన IAF AIR SHOWకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎయిర్ క్రాఫ్ట్స్ విన్యాసాలను వీక్షించేందుకు సన్‌గ్లాసెస్ ధరించి మోడ్రన్ లుక్‌లో కనిపించారు. ‘Tiger Ka Hukum’ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు CM రేవంత్ రెడ్డి ఫొటోను ‘X’లో పోస్ట్ చేశారు.