News April 9, 2025
HYD: మెట్రో రైల్ ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి

మెట్రో రైల్ ఎండీగా NVS రెడ్డికి ప్రభుత్వం మళ్లీ అవకాశం కల్పించింది. కీలకమైన రెండో దశ ప్రాజెక్టులో ఆయన సేవలను వినియోగించుకోవాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక విషయాలపై ఆయనకు అవగాహన ఉందని, అందుకే ఆయన్ని ఆ పదవిలో కొనసాగించినట్లు సమాచారం. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు.
Similar News
News October 18, 2025
కామారెడ్డి: నేడే లాస్ట్ డేట్

కామారెడ్డి జిల్లాలోని మొత్తం 49 మద్యం దుకాణాల కోసం శుక్రవారం వరకు 833 దరఖాస్తులు వచ్చాయని కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంత రావు తెలిపారు. అప్లికేషన్లకు శనివారం చివరి రోజని ఆయన తెలిపారు. చివరి రోజు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా కామారెడ్డి స్టేషన్ పరిధిలోని 15 షాపులకు 240 దరఖాస్తులు వచ్చాయి.
News October 18, 2025
పవన్-లోకేశ్ కాంబోలో సినిమా?

టాలీవుడ్‌లో క్రేజీ కాంబో సెట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ పవన్‌తో మూవీ లాక్ చేసుకుంది. ఆ అవకాశం తమిళ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్‌కు దక్కబోతోందని టాలీవుడ్‌లో టాక్ స్టార్ట్ అయ్యింది. అలాగే డైరెక్టర్ హెచ్.వినోద్ పేరు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నట్లు చెబుతున్నారు.
News October 18, 2025
NZB: దరఖాస్తులకు నేడే చివరి తేదీ

NZB జిల్లాలో మద్యం టెండర్లకు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 102 మద్యం దుకాణాలకు శుక్రవారం వరకు 1419 దరఖాస్తుల స్వీకరించినట్లు నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. నిజామాబాద్‌లో 492, బోధన్ 299, ఆర్మూర్ 260, భీమ్‌గల్ 171 దరఖాస్తులు వచ్చాయన్నారు. శనివారంతో టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. చివరి రోజు దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది.