News April 9, 2025

HYD: మెట్రో రైల్ ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి

image

మెట్రో రైల్ ఎండీగా NVS రెడ్డికి ప్రభుత్వం మళ్లీ అవకాశం కల్పించింది. కీలకమైన రెండో దశ ప్రాజెక్టులో ఆయన సేవలను వినియోగించుకోవాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక విషయాలపై ఆయనకు అవగాహన ఉందని, అందుకే ఆయన్ని ఆ పదవిలో కొనసాగించినట్లు సమాచారం. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు.

Similar News

News December 2, 2025

హైదరాబాద్‌లో మరో ఫిల్మ్ సిటీ

image

తెలంగాణ రైజింగ్ విజన్‌కు భారీ స్పందన లభిస్తోంది. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు, వ్యక్తులు ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్‌కు చెందిన అజయ్ దేవ్‌గణ్ ఫ్యూచర్ సిటీలో తన ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు సిద్ధం అవుతున్నారు. ఇదివరకు సీఎం రేవంత్ రెడ్డిని కలసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వంతో M0U చేసుకోనున్నట్లు సమాచారం.

News December 2, 2025

HYDలో యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్

image

హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం జరగనుంది. యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం హైదరాబాదులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 23 యూరోపియన్ దేశాలకు చెందిన 23 ఉత్తమ చిత్రాలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కానున్నాయి. ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్, శ్రీసారథి స్టూడియోస్, అలయన్స్ ఫ్రాన్సిస్ హైదరాబాద్‌లో ఈ సినిమాలు ప్రదర్శించనున్నారు. ఈనెల 5వ తేదీ నుంచి 14 వరకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

News December 2, 2025

HYD: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

image

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఖాజాగూడా చెరువు ఎఫ్‌టి‌ఎల్ పరిధిలో 8 భారీ టవర్స్ అక్రమంగా నిర్మిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్, మురళి నాయక్, రాకేష్ రెడ్డి పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, బిల్డర్లకు నోటీసులిచ్చింది.