News January 26, 2025
HYD: మెట్రో స్టేషన్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటీలు, కార్లు..!

హైదరాబాద్లో మెట్రో ఫస్ట్, లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ వద్ద దాదాపు 100 ఎలక్ట్రిక్ కార్లు, ఉమెన్ డ్రైవెన్ ఎలక్ట్రిక్ స్కూటీలను ప్రారంభించినట్లు మెట్రో ఎండి NVS రెడ్డి తెలిపారు.ఈ వాహనాలు మల్కాజిగిరి, ఈసీఐఎల్, సైనిక్పురి ప్రాంతాల మధ్య రాకపోకలు సాగిస్తాయని, త్వరలో అన్ని మెట్రో స్టేషన్ల వద్ద ఈ సర్వీసులు తెస్తామన్నారు.
Similar News
News December 7, 2025
కరీంనగర్ జిల్లా గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

కరీంనగర్ జిల్లా జీపీవో అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఉట్ల కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా ఆంజనేయప్రసాద్, ఉపాధ్యక్షులుగా నూనె రమేష్, సాగర్, అనిల్, కోశాధికారి హరీష్, అసోసియేట్ ప్రెసిడెంట్స్ గా నలువాల సాయికిషోర్, నీర్ల రేవంత్, జెట్టి శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలుగా పెంటి మమత, ఉపాధ్యక్షురాలుగా చందన, వనితలు ఎన్నికయ్యారు. తహశీల్దార్ బండి రాజేశ్వరి నూతన కమిటీని అభినందించారు.
News December 7, 2025
రెండో విడత.. 415 స్థానాలు ఏకగ్రీవం

TG: గ్రామపంచాయతీ ఎన్నికల్లో రెండో విడత నామినేషన్లలో మొత్తం 4,332 సర్పంచ్ స్థానాల్లో 415 చోట్ల ఏకగ్రీవమైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అత్యధికంగా కామారెడ్డిలో 44 అయ్యాయని తెలిపింది. అటు 38,322 వార్డు స్థానాల్లో 8,304 చోట్ల ఏకగ్రీవమయ్యాయని పేర్కొంది. మిగతా 3,911 సర్పంచ్ స్థానాల్లో 13,128 మంది పోటీ పడుతుండగా 29,903 చోట్ల 78,158 మంది బరిలో ఉన్నారని తెలిపింది. ఈ నెల 14న పోలింగ్ జరగనుంది.
News December 7, 2025
కోటగుళ్లలో సీనియర్ సివిల్ జడ్జి ప్రత్యేక పూజలు

గణపురం మండలం కోటగుళ్లలోని గణపేశ్వరాలయంలో ఆదివారం భూపాలపల్లి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకం, అర్చన నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో స్వామి వారి తీర్థప్రసాదాల అందజేశారు.


