News October 24, 2024
HYD మెట్రో 2వ ఫేజ్.. కేంద్ర అనుమతి వచ్చాక పనులు!

HYD మెట్రో 2వ దశ ప్రాజెక్ట్ DPR ఇప్పటికే సిద్ధం చేశారు. నాగోల్-RGIA ఎయిర్పోర్ట్ 36.6KM, ఎంజీబీఎస్-చంద్రాయణగుట్ట ఓల్డ్ సిటీ కారిడార్ 7.5KM, రాయదుర్గం-కోకాపేట 11.6KM, మియాపూర్ -పటాన్చెరు 13.4KM, ఎల్బీనగర్ -హయత్నగర్ 7.1KM, ఎయిర్పోర్ట్-ఫోర్త్ సిటీ 40KM పనులను రూ.32,237 కోట్ల అంచనాతో చేపట్టనున్నారు. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత, కేంద్రానికి పంపి అనుమతులు వచ్చాక పనులు మొదలుపెట్టనున్నారు.
Similar News
News November 12, 2025
FLASH: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డ్రగ్స్ పట్టివేత

శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈరోజు అధికారులు డ్రగ్స్ పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికుడు సలీంను (DRI) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో అతడి బ్యాగులో 4.3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, సలీంను అదుపులోకి తీసుకున్న అధికారులు, నిషేధిత వస్తువులను సీజ్ చేశారు.
News November 11, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: MLAలు, మాజీ MLAలపై కేసు నమోదు

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ సిటీ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. మధురానగర్ PSలో ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, రాందాస్పై రెండు కేసులు ఫైల్ అయ్యాయి. బోరబండ PSలో మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్పై ఓ కేసు నమోదైంది. కోడ్ ఉల్లంఘనపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజాస్వామ్యంగా ఎన్నికలు సాగాలంటే ప్రతి ఒక్కరూ నియమాలను గౌరవించాలని సిటీ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
News November 11, 2025
ప్రజావాణికి 29 ఫిర్యాదులు: రంగారెడ్డి కలెక్టర్

రంగారెడ్డి జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత శ్రద్ధ కనబరచాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి 29 ఫిర్యాదులు అందాయన్నారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.


