News October 24, 2024
HYD మెట్రో 2వ ఫేజ్.. కేంద్ర అనుమతి వచ్చాక పనులు!
HYD మెట్రో 2వ దశ ప్రాజెక్ట్ DPR ఇప్పటికే సిద్ధం చేశారు. నాగోల్-RGIA ఎయిర్పోర్ట్ 36.6KM, ఎంజీబీఎస్-చంద్రాయణగుట్ట ఓల్డ్ సిటీ కారిడార్ 7.5KM, రాయదుర్గం-కోకాపేట 11.6KM, మియాపూర్ -పటాన్చెరు 13.4KM, ఎల్బీనగర్ -హయత్‌నగర్ 7.1KM, ఎయిర్పోర్ట్-ఫోర్త్‌సిటీ 40KM పనులను రూ.32,237 కోట్ల అంచనాతో చేపట్టనున్నారు. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత, కేంద్రానికి పంపి అనుమతులు వచ్చాక పనులు మొదలుపెట్టనున్నారు.
Similar News
News November 23, 2024
TGSRTC పనితీరుపై HYDలో మంత్రి పొన్నం సమీక్ష
హైదరాబాద్‌లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో శనివారం TGSRTC పనితీరుపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, కొత్త బస్సుల కొనుగోలు, లాజిస్టిక్స్, ఆర్థిక పరమైన అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించారు.
News November 23, 2024
జూబ్లీహిల్స్: శివలింగం నుదుటిపై సింధూరమైన సూర్యకిరణాలు
జూబ్లీహిల్స్ వెంకటగిరిలోని శ్రీ వీరాంజనేయ సన్నిధిలో అద్భుతం చోటు చేసుకుంది. శివునికి అభిషేకం చేస్తున్న సమయంలో సూర్యకిరణాలు శివలింగం నుదుటిపై సింధూరంలా కనిపించాయి. సూర్యకిరణాలు నేరుగా స్వామి మీద పడి.. సింధూరంలో కనిపించిందని రామంజి గురుస్వామి, కమిటీ సభ్యులు తెలిపారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారన్నారు.
News November 23, 2024
జూబ్లీహిల్స్: సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న సీఎస్
సమగ్ర కుటుంబ సర్వేలో సీఎస్ శాంతి కుమారి పాల్గొని వివరాలను అందజేశారు. శుక్రవారం సీఎస్ ఇంటికి వెళ్లిన అధికారులు వివరాలను సేకరించారు. అధికారులకు సీఎస్ పూర్తి వివరాలు సంబంధిత పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. సర్వే ప్రక్రియను ఎన్యుమరేటర్ నీరజ, సర్కిల్ నోడల్ అధికారి సాయి శ్రీనివాస్, జూబ్లీహిల్స్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి పరిశీలించారు.