News March 30, 2025
HYD: మెహందీ ఆర్టిస్ట్ సూసైడ్ (UPDATE)

అత్తాపూర్లో శనివారం హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ శర్మ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. పోలీసులు వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ వాసి <<15926041>>పింకీ(37)<<>> అమిష్లోయాను ఇటీవల రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. పెద్దలను ఒప్పించి ఏప్రిల్ 22న మరోసారి పెండ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. అయితే, తాను జమ చేసిన డబ్బు భర్త షేర్ మార్కెట్లో పెట్టి నష్టపోయాడు. ఈ మనస్తాపంతో ఆమె ఉరేసుకుంది.
Similar News
News November 28, 2025
సనత్నగర్: పదో అంతస్తు నుంచి పడి బీటెక్ విద్యార్థిని మృతి

సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్పతరువు రెసిడెన్సీ అపార్ట్మెంట్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని పదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి మృతి చెందింది. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై సనత్నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News November 28, 2025
సదరం రీ-అసెస్మెంట్ జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం

విజయనగరం జిల్లాలో NTR భరోసా పింఛన్ రీ-అసెస్మెంట్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సదరం రీ-అసెస్మెంట్ కార్యక్రమంపై ఆయన శుక్రవారం తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రీ-అసెస్మెంట్లో జాప్యం జరుగుతుండటం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
News November 28, 2025
ఖమ్మం: సీపీఐ శతాబ్ది ఉత్సవాలు జనవరి 18కి వాయిదా

ఖమ్మం నగరంలోని ప్రసాద్ భవన్లో శుక్రవారం సీపీఐ నాయకుల సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ జాతీయ సమితి సభ్యుడు భాగం హేమంతరావు మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 26న ఖమ్మంలో జరగాల్సిన సీపీఐ శతాబ్ది ఉత్సవాలను జనవరి 18కి వాయిదా వేసినట్లు వారు తెలియజేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జనవరి 18న జరిగే జయంతి ఉత్సవాలకు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.


