News October 14, 2024
HYD: మేయర్ గద్వాల విజయలక్ష్మీపై కేసు నమోదు
GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మీపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సద్దుల బతుకమ్మ సంబరాల సందర్భంగా ఈనెల 10న అర్ధరాత్రి సమయంలో భారీ శబ్దాలతో హంగామా చేశారని ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్దేశిత సమయం దాటినా పోలీసులు అనుమతించిన డెసిబుల్స్ కంటే భారీ శబ్దాలతో స్థానికులకు ఇబ్బందులు కలిగించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెతో పాటు ఈవెంట్ నిర్వాహకులు విజయ్, గౌస్‌పై కేసు నమోదు చేశారు.
Similar News
News November 11, 2024
HYD: దేవాలయాల పరిరక్షణకు సీసీ కెమెరాలు
దేవాలయాల పరిరక్షణకు నిర్వాహకులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ పాటిల్ కాంతిలాల్ అన్నారు. దేవాలయాల వద్ద ఇటీవల జరుగుతున్న ఘటనల నేపథ్యంలో సభ్యులతో సమావేశం నిర్వహించారు. దేవాలయాల పరిరక్షణకు నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు. సౌత్ ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ స్వామి, చాంద్రాయణగుట్ట ఏసీపీ మనోజ్ కుమార్, సంతోష్ నగర్ ఏసీపి మహమ్మద్ గౌస్, ఐఎస్ సదన్ ఇన్స్పెక్టర్ నాగరాజులు ఉన్నారు.
News November 11, 2024
దక్షిణాదిపై పెరుగుతున్న ఉత్తరాది ప్రభావం: ప్రొ.గాలి వినోద్
దక్షిణ భారత జేఏసీ ఛైర్మన్ ప్రొ.గాలి వినోద్ అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ‘సెన్సస్, డీలిమిటేషన్ అండ్ త్రెట్స్ టూ సౌత్ ఇండియా’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రొ.నాగేశ్వర్, వీసీకే తెలంగాణ అధ్యక్షుడు జిలకర శ్రీనివాస్ పాల్గొన్నారు. బీజేపీ పాలనలో దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాది పెత్తనం పెరుగుతుందని, డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
News November 11, 2024
వయనాడు ఎంపీ ఉప ఎన్నికల బరిలో నగరవాసి..
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహించిన కేరళ వయనాడ్ లోక్ సభ ఉపఎన్నికల్లో హైదరాబాద్ అంబర్‌పేట్‌కు చెందిన జాతీయ జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ నాగేశ్వర్ రావు పోటీ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ తనకు ‘గ్రీన్ చిల్లి’ గుర్తు కేటాయించిందని ఆయన తెలిపారు. త్వరలో ఢిల్లీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులు బరిలో ఉంటారని తెలిపారు.