News May 12, 2024

HYD: మే 13 ఓటు వేయటం.. మరువకండి!

image

HYD నగర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి అన్నిరకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే హయత్ నగర్, LBనగర్, అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతాల్లో అధికారులు ఓటింగ్ శాతాన్ని పెంచడంలో భాగంగా ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు బస్‌స్టాప్‌లు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక బ్యానర్లను ఏర్పాటు చేసి మే 13న ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటు వేయడం మరిస్తే.. మన హక్కులపై పోరాడే స్వభావాన్ని కోల్పోతామని సూపర్వైజర్ సునీత తెలిపారు.

Similar News

News February 12, 2025

శంషాబాద్ విమానాశ్రయానికి 6 పుష్పక్ బస్సులు

image

శంషాబాద్ విమానాశ్రయానికి మరిన్ని పుష్పక్ సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఈడీ రాజశేఖర్ తెలిపారు. సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12:55 గం.కు మొదటి బస్సు, రాత్రి 11:55 గంటలకు ఆఖరి బస్సు ఉంటుందన్నారు. నేటి నుంచి విమానాశ్రయం మీదుగా 6 సర్వీసులు రాకపోకలు సాగిస్తాయన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12:50 గంటలకు మొదటి బస్సు, రాత్రి 11:50 గంటలకు చివరి బస్సు ఉంటుందన్నారు.

News February 12, 2025

HYD: పిల్లాడిని ఎత్తుకెళ్లారు.. ఇద్దరి అరెస్ట్

image

HYD కాచిగూడలో మానవ అక్రమ రవాణా రాకెట్ గుట్టురట్టు అయ్యింది. 2 నెలల మగ శిశువును కాచిగూడ పోలీసులు వారి నుంచి రక్షించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు కాచిగూడ డీమార్ట్‌లో బట్టలు కొనడానికి వెళ్లిన తల్లి, బట్టలు సెలెక్ట్ చేయడానికి బాబును పట్టుకొమ్మని నిందితుడికి ఇచ్చింది. దీంతో నిందితుడు అతడి తల్లి, బాబుతో ట్యాక్సీలో పరారవగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

News February 12, 2025

HYD: 9000113667 ఈ నంబర్‌కు కాల్ చేయండి..!

image

చెరువుల్లో మ‌ట్టి పోస్తున్న‌వారి స‌మాచారాన్ని తెలియ‌జేయాల‌ని హైడ్రా కోరింది. ఇందుకోసం ప్ర‌త్యేకంగా ఫోను నంబ‌ర్‌ను 9000113667 కేటాయించింది. అలాగే చెరువులో మ‌ట్టి పోస్తున్న లారీలు, టిప్ప‌ర్లు, ట్రాక్ట‌ర్లు, మ‌ట్టిని స‌ర్దుతున్న జేసీబీల‌ వీడియోల‌ను కూడా పంపించాల‌ని కోరింది. ఇప్ప‌టి వ‌ర‌కు 48 కేసులు కాగా రాత్రీప‌గ‌లు నిఘా ఉంచి నెల రోజుల్లో 31 లారీలను పట్టుకున్నామని తెలిపింది.

error: Content is protected !!