News April 5, 2025

HYD: మైనర్లు వాహనాలు నడిపితే.. రిజిస్ట్రేషన్ రద్దు

image

HYD ట్రాఫిక్ పోలీసులు నేటి నుంచి మైనర్ డ్రైవింగ్‌‌పై ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించనున్నారు. ‘మోటారు వెహికిల్ యాక్ట్ ప్రకారం మైనర్ డ్రైవింగ్ నేరం. వాహన రిజిస్ట్రేషన్‌ను 12 నెలల పాటు రద్దు చేస్తారు. మైనర్‌కి 25 ఏళ్లు వచ్చే వరకు లైసెన్స్ అర్హత ఉండదు. తల్లిదండ్రులు, వాహన యజమానులు దీనికి బాధ్యులు అవుతారు’ అని హెచ్చరించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ విజ్ఞప్తి చేశారు.

Similar News

News April 6, 2025

HYD: ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళల రక్షణ కోసం వాట్సప్ గ్రూప్

image

ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళల రక్షణకు ఆర్పీఎఫ్ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఓ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఏ రైలులో ఎవరు డ్యూటీలో ఉన్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా మహిళా కోచ్‌లలో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారనే విషయంపై దృష్టి సారిస్తున్నారు. ఎప్పటికప్పుడు వాట్సప్లో ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.

News April 6, 2025

సికింద్రాబాద్: రైలులోని వాష్‌రూమ్‌లో అత్యాచారం (UPDATE)

image

రక్సెల్-సికింద్రాబాద్ రైలులోని వాష్‌రూమ్‌లో బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడి ఫొటోలు బయటకొచ్చాయి. HYDను చూడడానికి ఫ్యామిలీతో కలిసి వస్తున్న బాలికపై బేగంపేటలో ఉండే <<15997705>>సంతోష్‌(బిహార్ వాసి)<<>> అత్యాచారం చేస్తూ వీడియో తీశాడు. ఈ ఫిర్యాదుతో పోక్సో కేసు కింద అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుపై పూర్తి నివేదిక పంపాలని తాజాగా DGP, RPF డీజీని జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ విజయ రహత్కార్‌ కోరారు.

News April 6, 2025

HYD: చికెన్ దుకాణాలు ఖాళీ

image

మాంసం ప్రియులకు సండే పండగే. ఉదయం చికెన్, మటన్ షాపుల వద్ద క్యూలైన్లు, కిటకిటలాడే గిరాకీ షరామామూలే. కానీ, ఈ ఆదివారం శ్రీ రామ నవమి కావడంతో దృశ్యం పూర్తిగా మారిపోయింది. ప్రతాపసింగారం సహా HYDలోని అనేక మాంసం దుకాణాలు వెలవెలబోయాయి. ఎప్పుడూ జనసంద్రంగా మారే మార్కెట్లు నిర్మానుష్యంగా కనిపించాయి. ఇదే సీన్ గత వారం ఉగాది రోజూ కనిపించింది. పండుగల దెబ్బకు అమ్మకాలు పూర్తిగా తగ్గాయని వ్యాపారస్థులు చెబుతున్నారు.

error: Content is protected !!