News May 1, 2024
HYD: మైనర్ బాలికపై అత్యాచారం.. యువకుడిపై కేసు
మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన జీహెచ్ఎంసీ డ్రైవర్ రామ్ చంద్ర యాదవ్(25) పై కాచిగూడ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎస్సై రవికుమార్ వివరాల ప్రకారం.. నింబోలి అడ్డకు చెందిన రామచంద్ర యాదవ్ మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. మంగళవారం బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Similar News
News January 13, 2025
HYD: మొగిలిగిద్దకు సీఎం రాక
HYD శివారు షాద్‌నగర్‌లోని ఫరూఖ్‌నగర్ మండలంలో మొగిలిగిద్ద గ్రామ ప్రభుత్వ పాఠశాలను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని గ్రామానికి చెందిన ప్రొఫెసర్ గ్రామస్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. మొగిలిగిద్దలో పాఠశాలను ప్రారంభించి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఉత్సవాలను ప్రారంభించడానికి రావాలని సీఎంను ఆహ్వానించారు.
News January 12, 2025
HYD: ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుంది: దానం
ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుందని MLA దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ కార్ రేసుతో HYD ఇమేజ్ పెరిగిందన్నాను.. కానీ అవినీతి జరగలేదని చెప్పలేదన్నారు. కంటి తుడుపు చర్యల్లా మూసీ వద్ద నాయకులు ఒక్కరోజు నిద్ర చేశారన్నారు. అక్కడికి వెళ్లే ముందే ACలు పెట్టించుకుని పడుకున్నారన్నారు. అక్కడివారు చేసిన జొన్న రెట్టేలు కాకుండా కిషన్ రెడ్డి బయట నుంచి ఇడ్లీలు తెప్పించుకున్నారని ఆరోపించారు.
News January 12, 2025
HYD: భువనగిరి టోల్ గేట్ వద్ద ఇదీ పరిస్థితి..!
HYD నగరం ఉప్పల్ నుంచి బోడుప్పల్, ఘట్కేసర్ మీదుగా వరంగల్ వైపు వెళ్తున్న మార్గ మధ్యమంలో ఉన్న భువనగిరి టోల్ గేట్ వద్ద భారీ సంఖ్యలో వాహనాలు నిలిచాయి. టోల్ గేట్ నుంచి దాదాపు అర కిలోమీటర్ మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. పలువురు వాహనదారులు ఫాస్ట్ ట్యాగ్ చేయించుకోకపోవడంతో కాస్త ఆలస్యం అవుతోంది. ఏదేమైనప్పటికీ ఇదే మార్గంలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.