News November 20, 2024

HYD: మొదటి దశలో అభివృద్ధి చేసే చెరువులు ఇవే!

image

గ్రేటర్ HYD పరిధిలో 185 చెరువుల అభివృద్ధి కోసం హైడ్రా ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా రాజేంద్రనగర్ అప్పా చెరువు, మాదాపూర్ సున్నం చెరువు, నిజాంపేట ఎర్రకుంట, కూకట్పల్లి నల్లచెరువు, ఖాజాగూడ చెరువు, అంబర్పేట బతుకమ్మ కుంట, మాదాపూర్ తమ్మిడికుంట, చందానగర్ ఈర్ల చెరువును మొదటి దశలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

Similar News

News December 13, 2024

HYD: అగ్నివీర్ల ట్రైనింగ్‌పై ప్రశంసలు

image

సికింద్రాబాద్ EME కేంద్రాన్ని సీనియర్ కల్నల్ కమాండెంట్ సిదాన సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ట్రైనింగ్, అడ్మినిస్ట్రేషన్‌లను పరిశీలించారు. అనంతరం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, బేసిక్ స్టాండర్డ్స్ మిలిటరీ ట్రైనింగ్, అగ్ని వీర్లకు అందిస్తున్న ట్రైనింగ్ విధానాన్ని ప్రశంసించారు. కార్యక్రమంలో వివిధ స్థాయి మిలిటరీ అధికారులు పాల్గొన్నారు.

News December 13, 2024

HYD: Xలో అల్లు అర్జున్ బెయిల్ ట్రెండింగ్..!

image

HYDలో ఉదయం అల్లు అర్జున్ అరెస్ట్ కాగా తాజాగా హైకోర్టు మధ్యంతర బెల్ మంజూరు చేసింది. నాలుగు వారాలపాటు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జాతీయ అవార్డు పొందిన నటుడి అరెస్ట్, బెయిల్ ట్విట్టర్ X‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. HYDలో హీరో అల్లు అర్జున్ అరెస్టు అంతర్జాతీయ స్థాయిలో ప్రభావం చూపింది.

News December 13, 2024

HYD: అరెస్ట్‌ ఎపిసోడ్‌.. పుష్పకు మరింత క్రేజ్‌

image

బన్నీ అరెస్టు వార్తతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. టీవీలలో ఎప్పటికప్పుడు వార్తలు చూస్తూ ఫ్యాన్స్‌, సినీ ప్రియులు ఏం జరుగుతోందో అని టెన్షన్‌‌తో గడిపారు. అరెస్టు చేస్తారా, చేస్తే రిమాండ్‌ చేస్తారా, మరి బెయిల్‌ వస్తుందా అని టీవీలకు అతక్కుపోయారు. చివరకు హైకోర్టు బెయిల్‌ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ అరెస్టు సీన్‌‌తో ఆయనకు మరింత క్రేజ్ పెరిగిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.