News October 4, 2024
HYD: మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో అడ్మిషన్స్

మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. MA-Urdu,MA -Hindi,MA-English, BA,B com, సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నా యని చెప్పారు. వెబ్సైట్ http//manuadmission mion.samarth.edu.in దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 10 నవంబర్ 2024 వరకు అవకాశం ఉందని చెప్పారు.
Similar News
News November 3, 2025
BREAKING: HYD: బాలానగర్లో MURDER

HYD బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు దారుణ హత్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఐడీపీఎల్ బస్టాప్ సమీపంలో గఫర్(39) అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడి రక్తస్రావం కారణంగా గఫర్ ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న బాలానగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
News November 3, 2025
జూబ్లీహిల్స్లో గెలుపు మాదే: కిషన్ రెడ్డి

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ ప్రచారం ఊపందుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అభ్యర్థి దీపక్ రెడ్డితో కలిసి బైక్ ర్యాలీ, క్యాంపెయిన్ నిర్వహించారు. నాగార్జున కమ్యూనిటీ హాల్ నుంచి ర్యాలీ ప్రారంభమైంది. జూబ్లీహిల్స్లో బీజేపీ గెలుపు పక్కా అని, BRS, కాంగ్రెస్ పాలనల్లో వెనుకబాటును సరిదిద్దేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఉపఎన్నికలో దీపక్ రెడ్డి విజయం కీలకమని పేర్కొన్నారు.
News November 3, 2025
VKB: తండ్రికి టాటా చెప్పి.. మృత్యువు ఒడికి

చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తాండూరు మండలంలోని ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. గౌతాపూర్ గ్రామానికి చెందిన చాంద్ పాషా కూతురు ముస్కాన్ (21) హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఆదివారం సెలవులో ఇంటికి వచ్చిన ఆమె, సోమవారం ఉదయం తాండూరు ఆర్టీసీ బస్సులో హైదరాబాద్కు బయల్దేరింది. బస్సు ఎక్కించే తండ్రికి “టాటా” చెప్పి వెళ్లిన ముస్కాన్ ప్రమాదంలో దుర్మరణం చెందింది.


