News April 10, 2025

HYD: యంగ్ ఇండియా నా బ్రాండ్: సీఎం

image

పోలీసులకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అత్యంత ముఖ్యమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘పోలీస్ శాఖపై నాకు స్పష్టమైన ఆలోచన ఉందని, దేశంలో ఉన్న గొప్ప వర్సిటీలు నెహ్రూ స్థాపించినవేనన్నారు. 16 నెలలైనా బ్రాండ్ ఎందుకు సృష్టించుకోలేదని నన్ను కొందరు అడుగుతున్నారు. ఇప్పుడు చెబుతున్నా.. నా బ్రాండ్ యంగ్ ఇండియా’ అని అన్నారు.

Similar News

News October 15, 2025

విశాఖ: దీపావళి వేళ భద్రత కట్టుదిట్టం

image

దీపావళి పండుగ సమీపిస్తుండటంతో రైళ్లలో క్రాకర్లు తీసుకెళ్లకుండా నిరోధించడానికి వాల్తేర్ డివిజన్ అధికారులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ప్రయాణీకులకు సురక్షితమైన ప్రయాణానికి డివిజన్ పరిధిలోని స్టేషన్లు, రైళ్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు కఠినమైన నిఘా ఉంచుతూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను భద్రతా సిబ్బందికి తెలపాలని కోరారు.

News October 15, 2025

రేపే మలయాళ స్వామి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన

image

శ్రీవ్యాసాశ్రమ వ్యవస్థాపకులు మలయాళ స్వామి విగ్రహ ఏర్పాటుకు ఆశ్రమ పూర్వ విద్యార్థులు ముందుకొచ్చారు. ఏర్పేడులోని వెంకటగిరి బైపాస్ క్రాస్ వద్ద విగ్రహ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం 7.30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. శ్రీవాసాశ్రమ శతాబ్ది ఉత్సవాల సమయానికి విగ్రహాన్ని ఆవిష్కరించేలా పనులు పూర్తి చేస్తామని పూర్వ విద్యార్థుల సంఘ సభ్యులు తెలిపారు.

News October 15, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: INCకి వ్యతిరేకంగా 1500 నామినేషన్లు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరిస్థితులు నెలకొన్నాయి. ఉప ఎన్నికలో INCకి వ్యతిరేకంగా 1500 మంది నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. 1000 మంది నిరుద్యోగులు, 300 మంది RRR భూ బాధితులు, 200 మంది మాల కులస్థులు నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్‌ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిస్తేనే అధికార అహంకారం తగ్గుతుందని, అప్పుడే చిత్తశుద్ధితో పని చేస్తారని పోటీదారులు పేర్కొంటున్నారు.