News November 8, 2024

HYD: యాక్సిడెంట్.. ప్రిన్సిపల్ మృతి

image

యాక్సిడెంట్‌‌లో HYD వాసి మృతి చెందారు. మలక్‌పేట అజంతా కాలనీకి చెందిన అర్చన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మం. బుదేరా సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాల ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. బుధవారం రోడ్డు ప్రమాదానికి గురైన అర్చనకు గుండెపోటు వచ్చింది. హుటాహుటిన లింగంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం చనిపోయినట్లు కుటుంబీకులు తెలిపారు. భర్త ప్రవీణ్ ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Similar News

News December 4, 2024

అమీర్‌పేట: ఆధార్ సేవల కోసం తప్పని తిప్పలు..!

image

TG, AP, ఒడిశా రాష్ట్రాల నుంచి ఆధార్ సేవల కోసం అమీర్‌పేట స్వర్ణ భారతి కాంప్లెక్స్ ఆధార్ రీజినల్ సెంటర్ వద్దకు వచ్చిన వారికి తిప్పలు తప్పడం లేదు. ప్రతిరోజు కేవలం 150 టోకెన్లు మాత్రమే ఇస్తుండడంతో, ఉదయం 6 గంటలకు వచ్చి క్యూ కడుతున్నారు. అసలే చలికాలం కావడంతో ఇబ్బందులు మరింత పెరిగాయి. మంగళవారం ఓ వ్యక్తికి మూర్చ రాగా.. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.

News December 4, 2024

పలు మెట్రో రైళ్లు మెట్టుగూడ వరకే..!

image

HYDలో మెట్రో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో మెట్రో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రాయదుర్గం నుంచి నాగోల్ వరకు డైరెక్ట్ మెట్రో సేవలకు బదులుగా, రాయదుర్గం నుంచి మెట్టుగూడ వరకు పలు రైళ్లను నడుపుతోంది. మెట్టుగూడ నుంచి తిరిగి రిటర్న్ రాయదుర్గం వెళ్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 4, 2024

BREAKING.. HYDలో ఈ ప్రాంతాల్లోనే భూకంపం

image

HYDను భూప్రకంపనలు కాసేపు హడలెత్తించాయి. ఉదయం 7:26 నుంచి 7:31 మధ్య భూమికంపించింది. పలువురు ఇంట్లో వస్తువులు కదిలాయని భయాందోళన చెందారు. హిమాయత్‌నగర్, సరూర్‌నగర్, సురారం, అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, యూసుఫ్‌గూడ, లాలాపేట్, బీఎన్‌రెడ్డి, ఉప్పల్, మేడ్చల్, మియాపూర్, ఇబ్రహీంపట్నం, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, DSNR, శామీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో సెకన్ల పాటు కంపించింది. మీ ప్రాంతంలో వచ్చిందా కామెంట్ చేయండి.