News February 3, 2025

HYD: యాక్సిడెంట్.. MLA గన్‌మెన్ మృతి

image

రోడ్డు ప్రమాదంలో MLA గన్‌మెన్ మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. శంకర్‌పల్లి మండలం బుల్కాపూర్‌కు చెందిన శ్రీనివాస్(34) ఆదివారం బీరప్ప జాతరకెళ్లాడు. జాతర ముగించుకుని స్వగ్రామానికి బయల్దేరాడు. కొండకల్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్ చేవెళ్ల MLA కాలే యాదయ్య వద్ద గన్‌మెన్‌గా పని చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 3, 2025

HYD: మీ పిల్లల్లో ఇలాంటి ప్రవర్తన గుర్తిస్తే జాగ్రత్త..!

image

మత్తుపదార్థాల వినియోగం యువతలో వేగంగా పెరుగుతుండటంతో రాచకొండ సీపీ సుధీర్ బాబు తల్లిదండ్రులకు ముఖ్యమైన హెచ్చరికను జారీ చేశారు. రేవ్‌పార్టీలు, అనుమానాస్పద మాత్రలు, రహస్య ప్రవర్తన వంటి ప్రారంభ లక్షణాలను గమనించడం వల్ల యువతను మత్తుపదార్థాల మాయాజాలం నుంచి కాపాడవచ్చన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడంతో సమస్యను ముందే గుర్తించి నివారించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

News February 3, 2025

HYD: అనుమతి నిరాకరించడంపై మందకృష్ణ ఫైర్

image

లక్ష డప్పులు.. వేయి గొంతులు కార్యక్రమానికి అనుమతి నిరాకరించడాన్ని ఖండిస్తున్నామని మందకృష్ణ మాదిగ అన్నారు. సోమాజిగూడలో ఆయన మాట్లాడుతూ.. సీఎం, డీజీపీ HYD సిటీ సీపీ పునరాలోచించాలని, పునఃసమీక్ష చేసి అనుమతిని మంజూరు చేయాలన్నారు. MRPS ఏ రోజూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పని చేయలేదని, మాదిగ పల్లెలో కనుమరుగవుతున్న డప్పులు మళ్లీ పునరుజ్జీవం పోసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

News February 3, 2025

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌కు కొత్త అధ్యక్షులు

image

తెలంగాణలో 27 జిల్లాల BJP అధ్యక్షులను ప్రకటించారు. హైదరాబాద్ అధ్యక్షుడిగా లంక దీపక్ రెడ్డి,  సికింద్రాబాద్ మహంకాళి-భరత్ గౌడ్, మేడ్చల్ జిల్లాకు బీ.శ్రీనివాస్‌ను నియమించారు.